iDreamPost
android-app
ios-app

వీడియో: సిక్సులతో విరుచుకుపడ్డ పంత్‌! యాక్సిడెంట్‌ తర్వాత ఫస్ట్‌ మ్యాచ్‌

  • Published Feb 21, 2024 | 5:25 PM Updated Updated Feb 21, 2024 | 5:25 PM

Rishabh Pant: రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌ 2024లో సత్తాచాటేందుకు రెడీ అవుతున్నాడు. ఆటకు చాలా కాలంగా దూరంగా ఉన్న పంత్‌.. తన రీఎంట్రీని గ్రాండ్‌గా ఇవ్వాలని బ్యాటింగ్‌లో తీవ్రంగ శ్రమిస్తున్నాడు. తాజాగా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant: రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌ 2024లో సత్తాచాటేందుకు రెడీ అవుతున్నాడు. ఆటకు చాలా కాలంగా దూరంగా ఉన్న పంత్‌.. తన రీఎంట్రీని గ్రాండ్‌గా ఇవ్వాలని బ్యాటింగ్‌లో తీవ్రంగ శ్రమిస్తున్నాడు. తాజాగా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 21, 2024 | 5:25 PMUpdated Feb 21, 2024 | 5:25 PM
వీడియో: సిక్సులతో విరుచుకుపడ్డ పంత్‌! యాక్సిడెంట్‌ తర్వాత ఫస్ట్‌ మ్యాచ్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తిరిగి గ్రౌండ్‌లోకి దిగేందుకు పూర్తిగా రెడీ అవుతున్నాడు. మరికొన్ని వారాల్లో ఐపీఎల్‌ 2024 సీజన్‌తో పంత్‌ బ్యాట్‌ పట్టి.. బౌలర్ల పని పట్టనున్నాడు. పంత్‌ 2022 డిసెంబర్‌ చివర్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి జార్ఖండ్‌లోని తన స్వస్థలానికి వెళ్తున్న సమయంలో రూర్కీ వద్ద పంత్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. డీవైడర్‌ను ఢీకొన్న కారు మంటల్లో పూర్తిగా కాలిపోయి.. బూడిదైంది. కానీ, అదృష్టం కొద్ది పంత్‌ ఎలాగోలా ఆ కారు నుంచి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నాడు.

కానీ, ప్రమాదంలో పంత్‌ తలకి, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పంత్‌ చాలా కాలం ఆటకు దూరం అయ్యాడు. చాలా రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న పంత్‌ ఆ తర్వాత కాస్త కోలుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రిహ్యాబ్‌ అవుతున్నాడు. ​ఐపీఎల్‌ 2024లో పంత్‌ ఆడతాడని ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. పంత్‌ సైతం ఐపీఎల్‌ వేలంలో డీసీ తరఫున పాల్గొన్నాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో సత్తాచాటడమే లక్ష్యంగా పంత్‌ ప్రిపేర్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పంత్‌ తన విశ్వరూపం చూపించాడు.

చాలా కాలం తర్వాత అంటే.. యాక్సిడెంట్‌ అయ్యాక తొలిసారి ఓ పూర్తి స్థాయి మ్యాచ్‌ ఆడిన పంత్‌.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆ మ్యాచ్‌లో పంత్‌ ఆడుతున్న షాట్లు చూస్తుంటే.. యాక్సిడెంట్‌కి ముందు పంత్‌ను చూసినట్లే ఉంది. అతని బ్యాటింగ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన అభిమానులు.. ‘ది డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌’, ‘ఇక బౌలర్ల ఊచకోతే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత పంత్‌ను ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉందంటూ పేర్కొంటున్నారు. మరి పంత్‌ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombaymavi girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis