Rishabh Pant: వీడియో: బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ను సెట్ చేసిన పంత్.. కెప్టెన్ రియాక్షన్ ఇదే!

Rishabh Pant sets Bangladesh fielding: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగడంతో పాటుగా.. అతడు చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Rishabh Pant sets Bangladesh fielding: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగడంతో పాటుగా.. అతడు చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో రీ ఎంట్రీని ఘనంగా చాటాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో సెంచరీతో కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేసిన పంత్.. ఈ ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలోనే 124 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఇక మూడోరోజు ఆటలో పంత్ చేసిన ఓ పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లాదేశ్ ఫీల్డ్ ను పంత్ సెట్ చేశాడు. ఇక పంత్ చెప్పినట్లే బంగ్లా కెప్టెన్ షాంటో చేయడం కొస మెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

రిషబ్ పంత్.. తన టెస్ట్ రీ ఎంట్రీని ఘనంగా చాటాడు. కారు యాక్సిడెంట్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ బాది భారత్ కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్న పంత్ 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేసి హసన్ మిరాజ్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో పంత్ చేసిన ఓ పని అందరిని నవ్వించింది. బంగ్లాదేశ్ ఫీల్డ్ సెటప్ ను పంత్ సెట్ చేశాడు. “భాయ్ ఇక్కడ ఒక ఫీల్డర్ ఉండాలి. ఓ ఫీల్డర్ ను ఇక్కడ పెట్టు”  అని బంగ్లా కెప్టెన్ షాంటోను ఉద్దేశించి చెప్పాడు.

ఇక ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే? పంత్ చెప్పినట్లుగానే అక్కడ ఓ ఫీల్డర్ ను సెట్ చేశాడు షాంటో. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దాంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ప్రత్యర్థి ఆటగాళ్లను వికెట్ల వెనకాల ఉండి కవ్విస్తూ ఉంటాడు. తన మాటలతో వారిని రెచ్చగొడుతూ ఉంటాడు. అలాగే అప్పుడప్పుడు ఇలా చిలిపి చేష్టలతో ఫ్యాన్స్ ను నవ్విస్తాడు. ఇక ఈ వీడియో చూసి.. పంత్ తన కెప్టెన్సీ స్కిల్స్ ను పక్క టీమ్ కు నేర్పుతున్నాడని, త్వరలోనే టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ అవుతాడని ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 2019 వరల్డ్ కప్ సందర్భంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సైతం ధోని ఇలాగే బంగ్లా ఫీల్డ్ ను సెట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను 287/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల టార్గెట్ ను ఉంచింది. మరి బంగ్లాదేశ్ ఫీల్డ్ ను రిషబ్ పంత్ సెట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments