Rishabh Pant: స్పెషల్ ఇంటర్వ్యూ.. యాక్సిడెంట్‌లో బతుకుతా అనుకోలేదు! ఆ శక్తే కాపాడింది: పంత్‌

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తాజాగా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో.. తన యాక్సిడెంట్ కు సంబంధించిన పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తాజాగా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో.. తన యాక్సిడెంట్ కు సంబంధించిన పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

డిసెంబర్ 30, 2022 టీమిండియా క్రికెట్ లో ఓ దురదృష్టకరమైన రోజు. భారత స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇదే రోజున కారు ప్రమాదానికి గురైయ్యాడు. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఈ ఘటనలో అతడి కారు కాలి బూడిదైపోయింది. స్థానికులు సకాలంలో అతడిని కారు నుంచి బయటకి తీయడంతో.. ప్రాణాలు దక్కించుకున్నాడు పంత్. ఇక ఈ ఘటనపై తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. యాక్సిడెంట్ లో తాను బతుకాతనని అనుకోలేదని, ఏదో శక్తి నన్ను కాపాడిందని పంత్ తెలిపాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రిషబ్ పంత్.. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో స్టార్ బ్యాటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ధోని తర్వాత కీపింగ్ బాధ్యలు చేపట్టిన పంత్.. అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. దీంతో అతడికి జట్టులో ప్లేస్ సుస్థిరమైంది. అయితే అనూహ్యంగా 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు పంత్. కాగా.. తిరిగి జట్టులోకి రావాలన్న కసితో, కఠోర శిక్షణతో పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. ఇక తన హెల్త్ అప్డేట్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పెడుతూనే ఉన్నాడు పంత్. జిమ్ లో బరువులు ఎత్తుతున్న వీడియోలతో తన కబ్ బ్యాక్ ను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నాడు. ఇదిలా  ఉండగా.. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ‘బిలీవ్ రిషబ్ పంత్’ పేరిట స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ స్టార్ క్రికెటర్. ఇక ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో పంత్ యాక్సిడెంట్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
రిషబ్ పంత్ మాట్లాడుతూ..”యాక్సిడెంట్ జరగడంతో.. నా లైఫ్ ముగిసిందని ఫస్ట్ టైమ్ అనుకున్నాను. అయితే నిజంగా నేను అదృష్టవంతుడిని. ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలిగాను. నాకు తెలియని ఏదో శక్తి నన్ను కాపాడింది. నేను కోలుకోవడానికి 16-18 నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ నేను కఠోర శ్రమతో ఇప్పుడు మీ ముందు ఉన్నాను. ఇది నాకు పునర్జన్మ” అంటూ ప్రోమోలో చెప్పుకొచ్చాడు పంత్. కాగా.. ఫుల్ ఇంటర్వ్యూ ఫిబ్రవరి 1,2వ తేదీల్లో స్టార్ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమింగ్ కానుంది. యాక్సిడెంట్ టైమ్ లో, యాక్సిడెంట్ తర్వాత తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు దీని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రిషబ్ పంత్ ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ముందుండి నడపనున్నాడు. పంత్ ఐపీఎల్ తో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ మెగాటోర్నీ తర్వాత జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు కూడా అందుబాటులోకి వస్తాడు. ఇది టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే పంత్ లేని లోటు చాలా మ్యాచ్ ల్లో మనకు కనిపించింది. కాగా.. యాక్సిడెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు.
Show comments