Rishabh Pant: రీ ఎంట్రీలో పంత్ సూపర్ సెంచరీ.. దెబ్బకు ధోని రికార్డు సమం!

Rishabh Pant Equaled MS Dhoni Record: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును సమం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Rishabh Pant Equaled MS Dhoni Record: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును సమం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రిషబ్ పంత్ టెస్టుల్లో తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. కారు ప్రమాదం జరిగిన తర్వాత చాలా రోజుల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్ 2024తో క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. ఈ సీజన్ లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇక ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సైతం రాణించాడు. దాంతో సెలెక్టర్లు సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు పంత్ ను ఎంపిక చేశారు. ఇక వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. రీఎంట్రీ తొలి టెస్ట్ లోనే సెంచరీతో దుమ్మురేపాడు. 124 బంతుల్లో సెంచరీ మార్క్ ను చేరుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సరసన చేరాడు.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు పంత్. మరో వైపు శుబ్ మన్ గిల్ 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో బంగ్లా ముందు 515 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది టీమిండియా. ఇక 634 రోజుల తర్వాత టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. శతకంతో కదం తొక్కాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ ధోని రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో ధోని 144 ఇన్నింగ్స్ ల్లో 6 సెంచరీలు చేయగా.. పంత్ కేవలం 58 ఇన్నింగ్స్ ల్లోనే 6 సెంచరీలు బాదాడు. దాంతో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఇండియన్ కీపర్ల జాబితాలో ధోనితో పాటుగా నిలిచాడు. నెక్ట్స్ మ్యాచ్ లో ధోని రికార్డును బద్దలు కొట్టడం ఖాయం. కారు ప్రమాదం తర్వాత ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ కొట్టడంతో.. పంత్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 రన్స్ కు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 287/4 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించింది. దాంతో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. ఇక బంగ్లా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 149 రన్స్ కే కుప్పకూలిన విషయం తెలిసిందే. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్ ను దాటిగానే ఆరంభించింది. మూడోరోజు టీ బ్రేక్ సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు జాకీర్ హసన్(32), షాద్ మన్ ఇస్లామ్(21) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి బంగ్లా ఇంకా 459 పరుగులు వెనకబడి ఉంది. మరి రీ ఎంట్రీలో వచ్చి సెంచరీ చేయడమే కాకుండా.. ధోని రికార్డును సమం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments