వీడియో: బ్యాట్​కు పూజ చేసిన పంత్.. సెంచరీలు ఊరికే రావు!

Rishabh Pant, IND vs BAN: స్టైలిష్​ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన బ్యాట్ పదును ఏంటో మరోమారు చూపించాడు. టెస్టుల్లో టీమిండియాకు తాను ఎంత కీలకమో ప్రూవ్ చేశాడు. చెన్నై టెస్టులో మార్వలెస్ సెంచరీతో చెలరేగిపోయాడు.

Rishabh Pant, IND vs BAN: స్టైలిష్​ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన బ్యాట్ పదును ఏంటో మరోమారు చూపించాడు. టెస్టుల్లో టీమిండియాకు తాను ఎంత కీలకమో ప్రూవ్ చేశాడు. చెన్నై టెస్టులో మార్వలెస్ సెంచరీతో చెలరేగిపోయాడు.

టీమిండియా తరఫున అదరగొడుతున్న సమయంలోనే కారు యాక్సిడెంట్​కు గురయ్యాడో స్టార్ ప్లేయర్. ఘోర ప్రమాదం కారణంగా రెండేళ్లు ఆస్పత్రి బెడ్​కే పరిమితమయ్యాడు. ఇక అతడు కమ్​బ్యాక్ ఇవ్వడం అయ్యే పనికాదని అంతా అనుకున్నారు. కానీ పట్టుదలతో లేచి నిలబడిన ఆ ఆటగాడు.. క్రమంగా నడక స్టార్ట్‌ చేశాడు. ఆ తర్వాత ఫిట్​నెస్, బ్యాటింగ్​ టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకోవడంపై వర్క్ చేశాడు. అలా చాన్నాళ్లు కష్టపడి ఐపీఎల్​లో ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్​కు ఎంపికై.. భారత్ ఆ ట్రోఫీని గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అతడే రిషబ్ పంత్. ఈ స్టైలిష్ వికెట్ కీపర్ నమ్మశక్యం కాని రీతిలో కమ్​బ్యాక్ ఇచ్చాడు. రీఎంట్రీలో వన్డేలు, టీ20ల్లో అదరగొడుతున్న పంత్.. తనకు ఇంత ఫేమ్, క్రేజ్ తీసుకొచ్చిన టెస్టుల్లోనూ సత్తా చాటాడు. అయితే అతడి సక్సెస్​లో ఆయుధ పూజది కీలక పాత్ర అని చెప్పొచ్చు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

బంగ్లాదేశ్​తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో వీరవిహారం చేశాడు పంత్. సెకండ్ ఇన్నింగ్స్​లో 67 పరుగులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఔట్ అయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన పంత్ సూపర్బ్ ఇన్నింగ్స్​తో టీమ్​కు భారీ స్కోరు అందించాడు. శుబ్​మన్ గిల్ (119)తో కలసి జట్టకు బిగ్ లీడ్ అందజేశాడు. 128 బంతుల్లో 109 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బౌండరీలు, 4 భారీ సిక్సులు బాది బంగ్లాదేశ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అయితే పంత్ బ్యాటింగ్​కు రాకముందు ఆయుధ పూజ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీఎంట్రీ తర్వాత ఫస్ట్ టెస్ట్ ఆడుతుండటంతో రాణించాలనే కసితో ఉన్న పంత్.. బ్యాటింగ్​కు వచ్చే ముందు తన కిట్​ను బయటకు తీశాడు. హెల్మెట్, గ్లవ్స్ సహా బ్యాట్ కూడా ఒక టేబుల్ మీద పెట్టాడు.

బ్యాట్ ముందు నిలబడి కాసేపు ప్రార్థన చేశాడు పంత్. తాను రాణించాలి, భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత దండం పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పంత్ పూజ చూసిన నెటిజన్స్.. సెంచరీలు ఊరికే రావని అంటున్నారు. అతడు చేసింది ఆయుధ పూజ అని, తనకు ఎంతో ముఖ్యమైన బ్యాట్​కు అతడు దండం పెట్టి ప్రార్థించడం ఫలించిందని, అందుకే సెంచరీ బాదాడని చెబుతున్నారు. ఆయుధ పూజ అనేది మన కల్చర్​లో ఒక భాగమని.. పంత్ దాన్ని ఫాలో అవడం మంచి విషయమని కామెంట్స్ చేస్తున్నారు. ఎంత నేమ్, ఫేమ్, క్రేజ్ వచ్చినా సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకపోవడం అద్భుతమని చెబుతున్నారు. అతడి బ్యాట్ నుంచి ఫ్యూచర్​లో మరిన్ని సెంచరీలు రావడం ఖాయమని చెబుతున్నారు. మరి.. పంత్ ఆయుధ పూజపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments