రోహిత్ కష్టం తీర్చిన పంత్! నెల రోజుల టెన్షన్ ఒక్క రోజులో పోగొట్టాడు!

Rishabh Pant, Rohit Sharma, DC vs GT: ఐపీఎల్‌తో రోహిత్‌ శర్మ ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక విషయంలో బాగా టెన్షన్‌ పడుతున్నాడు. ఆ టెన్షన్‌ను పంత్‌ ఒక దెబ్బతో తీర్చేశాడు. ఆ టెన్షన్‌ ఏంటో? పంత్‌ ఎలా తీర్చాడో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant, Rohit Sharma, DC vs GT: ఐపీఎల్‌తో రోహిత్‌ శర్మ ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక విషయంలో బాగా టెన్షన్‌ పడుతున్నాడు. ఆ టెన్షన్‌ను పంత్‌ ఒక దెబ్బతో తీర్చేశాడు. ఆ టెన్షన్‌ ఏంటో? పంత్‌ ఎలా తీర్చాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా టీమిండియాకు ఆడే ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇలా అంతా మంచి టచ్‌లో ఉన్నారు. ఈ ఐపీఎల్‌ తర్వాత టీమిండియా.. వెస్టిండీస్‌, అమెరికా సయుక్తంగా నిర్వహించే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఆడనున్న విషయం తెలిసిందే. జూన్‌లో ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. ఒక వైపు ఐపీఎల్‌ హోరాహోరీగా సాగుతున్నా.. మరోవైపు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం.. టీ20 వరల్డ్‌ కప్‌పై కూడా ఫోకస్ పెట్టారు. టీమ్‌ను ఎంపిక చేసే పనిలో భాగంగా.. ఈ ఇద్దరు తరచు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ కమ్రంలోనే టీమ్‌లో ఉండాల్సిన ఆటగాళ్లు, ఏ ప్లేస్‌కు ఎవర్ని ఎంపిక చేయాలి, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బాగా రాణిస్తున్న ఆటగాళ్ల లిస్ట్‌ ఇలా.. రోహిత్‌, అగార్కర్‌కు పెద్ద తలనొప్పే ఉంది. అన్నింటికంటే మరీ ముఖ్యంగా టీమిండియాకు మెయిన్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా ఎవర్ని టీమ్‌లోకి తీసుకోవాలనే విషయంలో రోహిత్‌ శర్మ.. కొన్ని నెలలుగా టెన్షన్‌ పడుతున్నాడు. ఎందుకంటే.. రిషభ్‌ పంత్‌ పెద్ద ప్రమాదం నుంచి బయట పడి నేరుగా ఐపీఎల్‌ ఆడుతున్నాడు. అలాగే కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేడు, సంజు శాంసన్‌పై ఒక కన్ను ఉన్నా.. అతను ఎప్పుడు అవుట్‌ ఆఫ్‌ ఫామ్‌లో ఉంటాడో అతనికే తెలియదు. ఇక ఇషాన్‌ కిషన్‌పై బీసీసీఐ సీరియస్‌గా ఉంది, పైగా డొమెస్టిక్‌ క్రికెట్‌ కూడా లేదు. ఇవి ఐపీఎల్‌ కంటే ముందు.. రోహిత్‌ శర్మ ముందు ఉన్న సమస్యలు. వికెట్‌ కీపర్‌పై ఎలాంటి స్పష్టత లేదు.

కానీ, టోర్నీ ముంచుకొస్తూనే ఉంది. ఒక్కసారి ఐపీఎల్‌ స్టార్‌ అయిన తర్వాత.. వీరిలో ఎవరి సత్తా ఏంటో బయటపడుతూ వచ్చింది. ఇషాన్‌ కిషన్‌ దారుణంగా విఫలం అవుతున్నాడు, కేఎల్‌ రాహుల్‌ రాణిస్తున్న.. స్ట్రైక్‌రేట్‌ విషయంలో సమస్య ఎదురవుతోంది. ఇక సంజు శాంసన్‌ బాగానే ఆడుతున్నాడు. బ్యాకప్‌ కీపర్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఇక ఫైనల్‌గా రోహిత్‌ శర్మ నెల రోజులుగా పడుతున్న టెన్షన్‌ను దూరం చేసింది మాత్రం.. రిషభ్‌ పంత్‌ అనే చెప్పాలి. అందరి కంటే ఎక్కువ అంచనాలు ఉన్నా రిషభ్‌ పంత్‌ తన పాత రోజులను గుర్తు చేస్తూ.. అద్భుతంగా చెలరేగిపోతున్నాడు. బుధవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సులతో 88 పరుగులు చేసి అదరగొట్టాడు. అలాగే వికెట్‌ కీపింగ్‌లో కూడా సూపర్‌ డూపర్‌ క్యాచ్‌లు పడుతూ.. వికెట్‌ కీపర్‌గా కూడా బాగా రాణిస్తున్నాడు.

టీమిండియా పంత్‌ నుంచి ఏం కోరుకుంటుందో అంతకంటే ఎక్కువే చేసి చూపిస్తున్నాడు. బుధవారం గుజరాత్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టీమ్‌లో ప్లేస్‌ ఫిక్స్‌ అయిపోయినట్లు సమాచారం. ఎందుకంటే గత మ్యాచ్‌ల్లో కూడా పంత్‌ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన పంత్‌.. 48.86 యావరేజ్‌, 161.32 స్ట్రైక్‌రేట్‌తో 342 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు పంత్‌. మరి పెద్ద ప్రమాదం నుంచి బయటపడి.. ఇంత బాగా ఆడుతూ.. టీమిండియాలో చోటు ఖాయం చేసుకున్న పంత్‌ గురించి, అలాగే వికెట్‌ కీపర్‌ ఎవరా అని టెన్షన్‌ పడుతున్న రోహిత్‌ శర్మను ఆ టెన్షన్‌ నుంచి బయటపడేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ​

Show comments