Rishabh Pant: రోహిత్, సిరాజ్ కు సారీ చెప్పిన రిషబ్ పంత్! ఎందుకంటే?

Rishabh Pant Apologises to Rohit Sharma and Mohammed Siraj: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండో రోజు మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన నమోదు అయ్యింది. రిషబ్ పంత్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా మహ్మద్ సిరాజ్ కు సారీ చెప్పాడు. ఎందుకంటే?

Rishabh Pant Apologises to Rohit Sharma and Mohammed Siraj: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండో రోజు మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన నమోదు అయ్యింది. రిషబ్ పంత్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా మహ్మద్ సిరాజ్ కు సారీ చెప్పాడు. ఎందుకంటే?

బంగ్లాదేశ్ తో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. తమ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 376 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలిరోజు 6 వికెట్లకు 339 పరుగులు చేసిన టీమిండియా.. రెండో రోజు ఆటను ప్రారంభించిన కొద్ది సమయానికే కేవలం 37 రన్స్ మాత్రమే యాడ్ చేసి మిగతా 4 వికెట్లను కోల్పోయింది. ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ను కోలుకోని విధంగా దెబ్బతీశారు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ లకు రిషబ్ పంత్ క్షమాపణలు చెప్పాడు.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో తొలి రోజు బ్యాట్ తో రాణించిన టీమిండియా.. రెండో రోజు బంతితో అదరగొట్టింది. లంచ్ బ్రేక్ వరకే బంగ్లా సగం వికెట్లను కూల్చి.. పైచేయి సాధించింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ లు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇక భారత్ ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు తొలి ఓవర్లోనే ఊహించని షాకిచ్చాడు బుమ్రా. తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ షాద్ మన్ ఇస్లామ్(2) ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత జాకీర్ హసన్ ను ఆకాశ్ దీప్ పెవిలియన్ కు పంపించాడు. అయితే జాకీర్ హసన్ వికెట్ సిరాజ్ కు దక్కాల్సింది. కానీ రిషబ్ పంత్ చేసిన తప్పు వల్ల అతడికి ముందు ఓ లైఫ్ లభించింది. దాంతో తన తప్పు తెలుసుకున్న పంత్ రోహిత్, సిరాజ్ కు సారీ చెప్పాడు. అసలేం జరిగిందంటే?

బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత తన సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడు మహ్మద్ సిరాజ్. స్ట్రైకింగ్ లో జాకీర్ హసన్ ఉన్నాడు. ఇక ఈ ఓవర్ 5వ బంతిని సిరాజ్ అద్భుతంగా డెలివరీ చేశాడు. అది కాస్త అతడి ప్యాడ్స్ ను తాకింది. కానీ.. కీపర్ రిషబ్ పంత్ బాల్ హైట్ వచ్చిందని పైగా వికెట్లను కూడా తాకలేదని రోహిత్ చెప్పాడు. దాంతో రివ్యూ తీసుకోలేదు. అయితే సిరాజ్ మాత్రం బాల్ కచ్చితంగా వికెట్లకు తాకిందని చెప్పాడు. కానీ రోహిత్ పంత్ మాట వినడంతో.. DRS తీసుకోలేదు. కానీ.. రిప్లేలో చూస్తే బాల్ లెగ్ స్టంప్ ను గిరాటేసినట్లు స్పష్టంగా కనిపించింది. రివ్యూ తీసుకుంటే అది ఔట్ గా అయ్యేది. కానీ పంత్ కారణంగా అలా జరగలేదు. ఈ క్రమంలో సిరాజ్ తన అసహనం వ్యక్తం చేశాడు. దాంతో తర్వాత తన తప్పు తెలుసుకున్న పంత్ కెప్టెన్ రోహిత్ శర్మ, సిరాజ్ లకు క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే పంత్ లైఫ్ ఇచ్చినా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జాకీర్ హసన్. ఆ తర్వాత 22 బంతులు ఆడి 3 పరుగులు చేసిన అతడు ఆకాశ్ దీప్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మరి పంత్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments