రిషబ్ పంత్.. భారత క్రికెటర్లలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారిలో ఒకడని చెప్పొచ్చు. టీమిండియాకు లభించిన అరుదైన టాలెంటెడ్ ప్లేయర్లలో పంత్ ఒకడని విశ్లేషకులు అంటుంటారు. కీపర్‌గా కంటే బ్యాటర్‌గా రిషబ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా తరఫున అతడు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. కెరీర్ మంచి స్వింగ్‌లో ఉన్న టైమ్‌లో పంత్‌కు యాక్సిడెంట్ అయింది. గతేడాది డిసెంబర్ 30వ తేదీన తన కారులో ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొన్నాడు. అయితే ఆ టైమ్‌లో అదృష్టవశాత్తూ గాయాలతో పంత్ బయటపడ్డాడు.
కారు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలి లిగ్మెంట్లు దెబ్బతినడంతో డాక్టర్లు అతడికి సర్జరీ చేశారు. గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 మొత్తం సీజన్‌కు ఈ స్టార్ లెఫ్టాండ్ బ్యాటర్ దూరమయ్యాడు. అలాగే ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు కూడా అతడు అందుబాటులో లేకుండా పోయాడు. అయితే సర్జరీ అనంతరం కోలుకున్న పంత్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరిపోయాడు. టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాడీ యంగ్ క్రికెటర్. తాజాగా తన ట్రైనింగ్‌కు సంబంధించిన ఒక వీడియోను పంత్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
తాజా వీడియోలో జోరుగా వర్కౌట్స్ చేస్తూ దర్శనమిచ్చాడు రిషబ్ పంత్. ఈ వీడియో చూస్తే అతడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఆడటమే టార్గెట్‌గా పంత్ కఠోర సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మునుపటిలా ఫుల్ ఫిట్‌గా మారేందుకు అతడికి మరికొంత టైమ్ పట్టేటట్లు కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు.. ‘చీకటి కుహరంలో కొంత వెలుగైనా చూడటం మొదలైనందుకు దేవుడికి ధన్యవాదాలు’ అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. రిషబ్ ఫిట్నెస్, వర్కౌట్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడు త్వరగా భారత జట్టులోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Thankful to god at least I have started seeing some light in the dark tunnel 🙏🤞🏻🤞🏻❤️.#blessed #RP17 pic.twitter.com/s1oy3H52EV
— Rishabh Pant (@RishabhPant17) September 4, 2023
Rishabh Pant is training hard to make a strong comeback! pic.twitter.com/Bl6yXyeYSW
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 4, 2023
ఇదీ చదవండి: ఇదేం ఫీల్డింగ్: 4 ఓవర్లలో 3 క్యాచ్‌లు మిస్!