iDreamPost
android-app
ios-app

వీడియో: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. రింకూ సింగ్‌కు స్పెషల్‌ మెడల్‌! ఎందుకంటే..?

  • Published Jul 31, 2024 | 10:36 AM Updated Updated Jul 31, 2024 | 10:36 AM

Rinku Singh, Ten Doeschate, IND vs SL, T Dileep: శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత.. రింకూ సింగ్‌ ఒక స్పెషల్‌ మెడల్‌ అందుకున్నాడు. మరి అతనికి ఆ స్పెషల్‌ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

Rinku Singh, Ten Doeschate, IND vs SL, T Dileep: శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత.. రింకూ సింగ్‌ ఒక స్పెషల్‌ మెడల్‌ అందుకున్నాడు. మరి అతనికి ఆ స్పెషల్‌ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 31, 2024 | 10:36 AMUpdated Jul 31, 2024 | 10:36 AM
వీడియో: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. రింకూ సింగ్‌కు స్పెషల్‌ మెడల్‌! ఎందుకంటే..?

సూర్య సేన సంచలనం సృష్టించింది. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో అద్భుత ప్రదర్శనతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో అదరగొట్టి.. చిన్న టార్గెట్‌ను కాపాడుకుని.. సూపర్‌ ఓవర్‌తో మ్యాచ్‌ గెలిచింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది భారత జట్టు. ఎవ్వరూ ఊహించని విధంగా పార్ట్‌టైమ్‌ బౌలర్లు భారత్‌ పంట పండించారు. ముఖ్యంగా రింకూ సింగ్‌ సూపర్‌ బౌలింగ్‌తో అదరగొట్టాడు. టీ20 క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా, బెస్ట్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ఈ కుర్రాడు.. తాజాగా బాల్‌తో మ్యాచ్‌కు మంచి ముగింపు ఇచ్చి.. బౌలర్‌గా కూడా బెస్ట్‌ ఫినిషర్‌ అనిపించుకున్నాడు.

అయితే.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రింకూ సింగ్‌కు డ్రెస్సింగ్‌ రూమ్‌లో స్పెషల్‌ మెడల్‌తో సత్కరించారు. రింకూతో పాటు వాషింగ్టన్‌ సుందర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం అద్బుతంగా బౌలింగ్‌ చేశారు.. మరి రింకూ ఒక్కొడికే స్పెషల్‌ మెడల్‌ ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ మెడల్‌ బౌలింగ్‌ కోసం కాదులేండి. సిరీస్‌ మొత్తం మీద బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు రింకూ సింగ్‌కు వరించింది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 నుంచి టీమిండియాలో ఒక అనవాయితీని ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీల్లో ప్రతి మ్యాచ్‌కు ఒక బెస్ట్‌ ఫీల్డర్‌కు మెడల్‌ బహుకరించారు.

Rinku singh

కానీ, ఇప్పుడు సిరీస్‌ మొత్తానికి కలిపి అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ, రన్స్‌ ఆపుతూ, మంచి ఇంటెంట్‌ కనబరస్తున్న ప్లేయర్‌కు బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ను ఇచ్చారు. తాజాగా శ్రీలంక సిరీస్‌లో రింకూ సింగ్‌ మంచి క్యాచ్‌లు అందుకున్నాడు. అందుకే అతనికి బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ను అందజేశారు. ఈ అవార్డును కొత్త అసిస్టెంట్‌ కోచ్‌, నెదర్లాండ్స్‌ మాజీ క్రికెటర్‌ ర్యాన్‌ టెన్‌ డస్కటే చేతుల మీదుగా రింకూ సింగ్‌కు బహుకరించారు. మెడల్‌ అందుకున్న రింకూ.. ‘గాడ్స్‌ ప్లాన్‌ బేబీ’ అంటూ తన సంతోషం వ్యక్తం చేశాడు. రింకూతో పాటు రియాన్‌ పరాగ్‌, రవి బిష్ణోయ్‌ ఈ మెడల్‌ కోసం పోటీ పడ్డారని ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ తెలిపాడు. మరి రింకూకు బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.