SNP
Rinku Singh, Yuvraj Singh: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిడిల్డార్‌లో టీమిండియాకు చాలా కాలంగా ఉన్న లోటును మర్చిపోయేలా చేస్తూ.. మరో యువరాజ్‌లా బ్యాటింగ్ చేశాడు. దీంతో.. టీమిండియాకు యువరాజ్ దొరికేసినట్లే అని క్రికెట్ నిపుణులు అంటున్నారు. మరి అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..
Rinku Singh, Yuvraj Singh: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిడిల్డార్‌లో టీమిండియాకు చాలా కాలంగా ఉన్న లోటును మర్చిపోయేలా చేస్తూ.. మరో యువరాజ్‌లా బ్యాటింగ్ చేశాడు. దీంతో.. టీమిండియాకు యువరాజ్ దొరికేసినట్లే అని క్రికెట్ నిపుణులు అంటున్నారు. మరి అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..
SNP
ఇండియన్ క్రికెట్ అభిమానులకు భారీ గుడ్‌న్యూస్.. ఇంతకాలంగా భారత జట్టుకు ఎలాంటి ఆటగాడు దొరకాలని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆశపడుతున్నారో.. అలాంటి ఆటగాడే దొరికేసినట్టు కనిపిస్తున్నాడు. సచిన్ పోతే.. అతని స్థానంలో కోహ్లీ వచ్చాడు.. కానీ, యువరాజ్ సింగ్ మ్యాచ్ విన్నర్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత టీమిండియాకు అలాంటి ప్లేయర్ లేడనే బాధ ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని గుండెల్లో ఉంది. ఇప్పుడా బాధను తగ్గిస్తూ.. అచ్చం యువరాజ్ సింగ్‌లానే మరో సింగ్ టీమిండియాను ఆదుకుంటున్నాడు. అతనే రింకూ సింగ్. ఎస్.. టీమిండియాలో మరో యువరాజ్ సింగ్‌లా మారే లక్షణాలు రింకూ సింగ్‌లో ఉన్నాయంటూ క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి రింకూలో ఉన్న ఆ క్వాలిటీస్ ఏంటో? యువీతో పోల్చడం ఎంత వరకు కరెక్టో ఇప్పుడు విశ్లేషిద్దాం..
యువరాజ్ సింగ్ టీమిండియాకు మిడిలార్డర్ లో వెన్నుముకలా ఉండేవాడు. ఓపెనర్లు మంచి స్టార్ ఇస్తే.. దానికి అంతే అద్భుతంగా ముగింపు ఇచ్చేవాడు. లేదా ఓపెనర్లు విఫలమై త్వరగా వికెట్లు పడితే.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత భుజాన వేసుకునే వాడు. అలా.. అవసరమైనప్పుడు వేగంగా బ్యాటింగ్ చేసి మంచి ఫినిషింగ్ ఇవ్వడం, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పి టీమ్‌ను కాపాడటం యువీకి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు రింకూ సింగ్ కూడా అచ్చం అలానే చేస్తున్నారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌నే తీసుకుంటే.. 55కే 3 వికెట్లు పడిన సమయంలో సూర్యతో కలిసి నిదానంగా ఆడుతూ.. పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశాడు. సూర్య అవుట్ అయ్యాకా.. తన బ్యాటింగ్‌లో వేగం పెంచి టీమిండియాకు మంచి స్కోర్ అందించాడు. గతంలో చివరి ఓవర్లలో బ్యాటింగ్ వచ్చిన సమయంలో క్రీజ్‌లోకి రావడం రావడంతోనే హిట్టింగ్‌కు దిగేవాడు. ఇలా యువీలోని బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు రింకూలో కనిపిస్తోంది.
ఇక యువీలోని మరో బెస్ట్ థింగ్ ఏంటంటే.. సిక్స్‌లను అలవోకగా కొట్టేస్తాడు. రిక్వైర్డ్ రన్‌రేట్ చేయి దాటిపోతున్నా.. లేదా ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలన్న.. యువరాజ్ చేసే ఫస్ట్ పని సిక్స్‌లతో విరుచుకుపడ్డాం. ఎలాంటి బౌలర్ బౌలింగ్‌లోనైనా చాలా సింపుల్‌గా సిక్స్‌లు కొట్టగలడు యువీ. అది పేస్ అయినా.. స్పిన్ బౌలింగ్ అయినా.. యువీ అనుకున్నాడంటే బంతి గ్రౌండ్ బయటపడాల్సిందే. ఇప్పుడు రింకూ సింగ్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. అవసరమైన సమయంలో సిక్స్‌లను చాలా ఈజీగా కొట్టగలడు. యువరాజ్ సింగ్‌కు ఒక ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన ఘనత ఉంటే.. రింకూకు కూడా ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు కొట్టిన చరిత్ర ఉంది. అది కూడా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఛేజింగ్ చేస్తూ కొట్టాడు.
బ్యాటింగ్‌తో పాటు యువీలో ఉన్న మరో బెస్ట్ క్వాలిటీ ఫీల్డింగ్. ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. తన ఫీల్డింగ్‌తో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్న యువీ.. కొన్ని సార్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇక రింకూ సింగ్ కూడా ఎంతో అద్భుతమైన ఫీల్డర్.. ఎలాంటి క్యాచ్‌నైనా చాలా సులువుగా పట్టేయగలడు. ఇప్పటికే పలు అసాధారణ క్యాచ్‌లు అందుకుని.. మంచి ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. అయితే.. యువీ ఆల్‌రౌండర్‌గా బౌలింగ్ చేస్తూ.. ఎన్నో విజయాలు అందించాడు. కానీ, రింకూ సింగ్ బౌలింగ్ చేయడు అదొక్కటి వదిలేస్తే.. బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయంలో అతను మరో యువరాజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే.. ఇంత త్వరగా లెజెండరీ క్రికెట్ యువరాజ్‌సింగ్‌తో రింకూను పోల్చడం సరికాకపోయినా.. ఇదే టెంపోను కొనసాగిస్తూ.. రింకూ మరో యువరాజ్ సింగ్ అవ్వాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. కాగా, ప్రస్తుతం రింకూ సింగ్ ఆడుతున్న విధానం చూస్తే.. అతను కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్‌లో ఉంటాడని క్రికెట్ నిపుణులు అంటున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్‌సింగ్ పోషించిన పాత్రను రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో రింకూ పోషించి.. భారత్‌కు రెండో టీ20 వరల్డ్ కప్ లు అందించాలని కూడా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి రింకూ ఆడుతున్న తీరు, యువరాజ్‌లో ఉన్న క్వాలిటీస్ తనలో ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rinku Singh has broken the glass of media box with a six. 🔥
– The future is here. pic.twitter.com/4hKhhfjnOr
— Johns. (@CricCrazyJohns) December 12, 2023