iDreamPost
android-app
ios-app

VIDEO: సూపర్‌ ఓవర్‌లో 17 రన్స్‌ కావాలి! రింకూ సింగ్‌ ఏం చేశాడంటే..?

  • Published Sep 01, 2023 | 11:50 AM Updated Updated Sep 01, 2023 | 11:50 AM
  • Published Sep 01, 2023 | 11:50 AMUpdated Sep 01, 2023 | 11:50 AM
VIDEO: సూపర్‌ ఓవర్‌లో 17 రన్స్‌ కావాలి! రింకూ సింగ్‌ ఏం చేశాడంటే..?

ఐపీఎల్‌ 2023 సందర్భంగా గుజరాత్‌ టైటాన్స్‌-కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌కు చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరమైన దశలో యువ సంచలనం రింకూ సింగ్‌ ఏకంగా చివరి ఐదు బంతుల్లో 5 సిక్సులు బాది.. సంచలన విజయాన్ని అందించాడు. ఆ ఇన్నింగ్స్‌తో రింకూ సింగ్‌ స్టార్‌గా మారిపోయాడు. అలాగే ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం అండర్‌ ప్రెజర్‌లో కూడా అద్భుతంగా ఆడటంతో అతనికి టీమిండియాలో కూడా చోటు దక్కింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో రింకూ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లోనూ రెండో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి టీమిండియాను గెలిపించాడు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌ టీ20 లీగ్‌లో ఆడుతున్న రింకూ సింగ్‌.. మీరట్‌ మావెరిక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గురువారం కాశీ రుద్రాస్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి రింకూ తన ఫినిషింగ్‌ సత్తా ఏంటో చాటి చెప్పాడు. సూపర్‌ ఓవర్‌లో మీరట్‌ గెలుపునకు 17 పరుగులు అవసరమైన దశలో తొలి బంతికి పరుగులేమీ చేయలేకపోయినా.. తర్వాత మూడు బంతుల్లో మూడు భారీ సిక్సర్ల బాది.. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. తనను ఎందుకు అంతా సిక్సర్ల కింగ్‌ అంటారో మరోసారి నిరూపించాడు.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మీరట్‌ మావెరిక్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. మీరట్‌ బ్యాటర్లు మాధవ్ కౌశిక్(87 నాటౌట్‌) రాణించడంతో మావెరిక్స్ బోర్డుపై 181/4 భారీ స్కోరును ఉంచగలిగింది. ఈ ఇన్నింగ్స్‌లో రింకూ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. 182 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన కాశీ రుద్రాస్‌ కూడా 20 ఓవర్లలో సరిగ్గా 181 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కాశీ ఒక వికెట్‌ కోల్పోయి 16 పరుగులు చేసింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్‌.. రింకూను బ్యాటింగ్‌కు పంపంది. కానీ స్పిన్నర్‌ శివసింగ్‌ సూపర్‌ వేసేందుకు సిద్ధమయ్యాడు. తొలి బంతికి పరుగులు చేయలేకపోయినా రింకూ.. రెండో బంతిని లాంగ్ ఆఫ్‌లో, మూడో బంతిని మిడ్-వికెట్ మీదుగా, నాలుగో బంతిని లాంగ్ ఆఫ్ రీజియన్‌పై నుంచి భారీ సిక్సులు బాది మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి తన బెస్ట్‌ ఫినిషన్‌ అని నిరూపించుకున్నాడు. మరి రింకూ సింగ్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: BREAKING: గుండెపోటుతో తెలుగు క్రికెటర్‌ మృతి!