iDreamPost
android-app
ios-app

వీడియో: సిక్సర్ల కింగ్‌.. రింకూ సింగ్‌! స్టేడియం బయటికెళ్లి చెట్ల పొదల్లో పడ్డ బాల్‌!

  • Published Jul 08, 2024 | 10:07 AM Updated Updated Jul 08, 2024 | 10:08 AM

Rinku Singh, IND vs ZIM: యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మరోసారి మెరిశాడు. ఈ సారి అతను కొట్టిన సిక్స్‌ ఏకంగా గ్రౌండ్‌ బయటికెళ్లి చెట్ల పొదల్లో పడింది. ఆ సూపర్‌ షాట్‌ గురించి మరింత తెలుసుకుందాం..

Rinku Singh, IND vs ZIM: యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మరోసారి మెరిశాడు. ఈ సారి అతను కొట్టిన సిక్స్‌ ఏకంగా గ్రౌండ్‌ బయటికెళ్లి చెట్ల పొదల్లో పడింది. ఆ సూపర్‌ షాట్‌ గురించి మరింత తెలుసుకుందాం..

  • Published Jul 08, 2024 | 10:07 AMUpdated Jul 08, 2024 | 10:08 AM
వీడియో: సిక్సర్ల కింగ్‌.. రింకూ సింగ్‌! స్టేడియం బయటికెళ్లి చెట్ల పొదల్లో పడ్డ బాల్‌!

టీమిండియా యంగ్‌ సూపర్‌ స్టార్‌ రింకూ సింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఐపీఎల్‌లో రిసెంట్‌గా బెస్ట్‌ ఫినిషనర్‌ ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి ఓవర్లలో అతను సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు.. ప్రత్యర్థి జట్టు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తన సిక్సులతో చంపేసేంత కసి రింకూ ఇన్నింగ్స్‌లో ఉంటుంది. ఐపీఎల్‌తో పాటు దేశవాళి క్రికెట్‌లో రాణించి.. భారత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రింకూ.. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌లోనూ తన దమ్ము చూపిస్తున్నాడు. తొలి టీ20లో విఫలమైనా.. రెండో మ్యాచ్‌లో దుమ్మురేపాడు. కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 48 పరుగులు చేసి తుపాన్‌ ఇన్నింగ్స​ ఆడాడు.

ఈ ఇన్నింగ్స్‌లో ఓ భారీ షాట్‌ గురించి మాట్లాడుకోవాలి. రింకూ సింగ్‌ భారీ భారీ సిక్సులను చాలా అలవోకగా కొడతాడనే విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమితో వచ్చిన కోపం అనుకుంటా.. రెండో టీ20లో రింకూ చాలా కసిగా సిక్సులు కొట్టాడు. అందులో ఒక సిక్స్‌ అయితే ఏకంగా 104 మీటర్ల దూరం వెళ్లిపడింది. స్టేడియం దాటి.. బయటి చెట్ల పొదల్లో వెళ్లి పడింది బాల్‌. ఆ సిక్స్‌ చూసి.. ఇది కదా రింకూ పవర్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. జింబాబ్వే బౌలర్‌ ముజరబాని వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ నాలుగో బంతిని లాంగ్‌ ఆఫ్‌ పై నుంచి భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ బాల్‌ గ్రౌండ్‌ బయటపడటం విశేషం. అదే ఓవర్‌లో చివరి బాల్‌కు మరో సిక్స్‌ బాదాడు రింకూ.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 100, రుతురాజ్‌ గైక్వాడ్‌ 47 బంతుల్లో 77, అలాగే పాకెట్‌ డైనమైట్‌ రింకూ సింగ్‌ 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సులతో 48 పరుగులు చేసి అదరగొట్టడంతో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. ఇక 235 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్‌ చేసి పడేశారు. ముఖేష్‌ కుమార్‌ 3, ఆవేశ్‌ ఖాన్‌ 3, రవి బిష్ణోయ్‌ 2 వికెట్లతో రాణించారు. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. మొత్తంగా అభిషేక్‌ శర్మ షోతో.. టీమిండియా 1-1తో ఈ సిరీస్‌ సమం చేసింది. మరి ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్‌ కొట్టిన 104 మీటర్ల భారీ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.