SNP
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా.. రింకూ ఆడిన ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ, మ్యాచ్ తర్వాత రింకూ సారీ చెప్పాడు. అతను అలా క్షమాపణలు ఎందుకు కోరాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా.. రింకూ ఆడిన ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ, మ్యాచ్ తర్వాత రింకూ సారీ చెప్పాడు. అతను అలా క్షమాపణలు ఎందుకు కోరాడో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసి 19.3 ఓవర్లలో 180 పరుగుల భారీ స్కోర్ చేసినా.. వర్షం కారణంగా లక్ష్యాన్ని కుదించి సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152 పరుగుల టఫ్ టార్గెట్ ఇచ్చినా.. టీమిండియా బౌలర్లు మ్యాచ్‌ను కాపాడలేకపోయారు. దీంతో.. భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పటికే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయినా విషయం తెలిసిందే. ఇక రెండో మ్యాచ్‌లో ఓటమితో మూడు వన్డే సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడింది. చివరిదైన మూడో మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా సిరీస్‌ను సరిచేస్తుందో లేదో చూడాలి. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన తర్వాత యువ క్రికెటర్ రింకూ సింగ్ తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పాడు. మంచి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లోనే టాప్ స్కోరర్‌గా నిలిచిన రింకూ క్షమాపణలు ఎందుకు చెప్పాడని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుతు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ డకౌట్ అవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్‌షిప్‌తో టీమిండియాను గట్టేక్కించారు. తిలక్ 29 పరుగులు చేసి అవుటైన తర్వాత.. సూర్యకు రింకూ జత కలిశాడు. 55 పరుగులకే మూడు వికెట్లు పడిపోవడంతో.. సూర్య-రింకూ ఆచీతూచి బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. సూర్య హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. సూర్య క్రీజ్‌లో ఉన్నంత వరకు అతనికే ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ, ఇబ్బంది పడుతూ నిదానంగా ఆడిన రింకూ.. క్రీజ్‌లో కుదురుకున్నాకా భారీ షాట్లు ఆడాడు.
39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 160 పరుగులకే పరిమితం అవుతుందనుకున్న భారత స్కోర్.. 180కి చేరిందంటే రింకూ వల్లే. అయితే.. రింకూ సూపర్ ఇన్నింగ్స్‌లో హైలెట్‌గా నిలిచింది మాత్రం.. సౌతాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో చివరి రెండు బంతుల్లో రింకూ రెండు భారీ సిక్సులు బాదాడు. అందులో ఒక సిక్స్ అయితే.. నేరుగా వెళ్లి మీడియా బాక్స్‌కు రక్షణగా ఉన్న భారీ అద్దాన్ని బద్దలుకొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రింకూ కొట్టిన బాక్స్ బ్రేకింగ్ సిక్స్ వైరల్‌గా మారింది. అయితే.. మ్యాచ్ తర్వాత మాట్లాడిన రింకూ.. తాను కొట్టిన సిక్స్ వల్ల అద్దం పగిలిన విషయం తనకు తెలియదని మ్యాచ్ ముగిసిన తర్వాత తెలిసిందని.. అద్దం పగలగొట్టినందకు రింకూ సారీ చెప్పాడు. అంత అద్భుతమైన షాట్ కొట్టడంతో పాటు.. దానికి సారీ కూడా చెప్పడంతో రింకూ ఎంతో హంబుల్‌పర్సన్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంస వర్షం కురుస్తోంది. మరి రింకూ కొట్టిన సిక్స్‌తో పాటు అతను సారీ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rinku Singh apologising for breaking the media box glass. 😂pic.twitter.com/Q8nK6Y9g99
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 13, 2023