ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో తనలో ఉన్న ఫినిషర్ ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాడు రింకూ సింగ్. ఈ క్రమంలోనే తన సక్సెస్ కు కారణం చెప్పుకొచ్చాడు ఈ చిచ్చర పిడుగు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో తనలో ఉన్న ఫినిషర్ ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాడు రింకూ సింగ్. ఈ క్రమంలోనే తన సక్సెస్ కు కారణం చెప్పుకొచ్చాడు ఈ చిచ్చర పిడుగు.
రింకూ సింగ్.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోని, దినేష్ కార్తీక్ తర్వాత మళ్లీ ఆ స్థాయి ఫినిషర్ ఎవరు దొరుకుతారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో 2023 ఐపీఎల్ సీజన్ లో ఓ ఆణిముత్యం దొరికింది. ఆ ముత్యం పేరు రింకూ సింగ్. ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో చివరి ఓవర్లో 5 బంతులకు 5 సిక్సులు కొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు రింకూ. ఈ ఒక్క మ్యాచ్ తో వరల్డ్ వైడ్ గా తన పేరు మారుమ్రోగిపోయింది. ఇక తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కూడా తనలో ఉన్న ఫినిషర్ ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే తన సక్సెస్ కు కారణం మహేంద్ర సింగ్ ధోని అని చెప్పుకొచ్చాడు ఈ యువ ఫినిషర్.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 2 వికెట్ల తేడాతో గెలిచి.. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి తనలో ఉన్న బెస్ట్ ఫినిషర్ ను బయటకి తీశాడు చిచ్చర పిడుగు రింకూ సింగ్. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరి ఓవర్లలో ఉత్కంఠ విజయం సాధించింది. భారత్ గెలవాలంటే చివరి బంతికి ఒక్క రన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో స్ట్రైక్ లో ఉన్న రింకూ సింగ్ ఏకంగా సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ కేవలం 14 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకూ మాట్లాడుతూ..”నేను మహేంద్ర సింగ్ ధోనీని రెండు సార్లు కలిశాను. ఈ సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పింది. అతడిని కలిసినప్పుడు ఒత్తిడిలో మ్యాచ్ ను ఎలా గెలిపించాలో, ప్రశాంతంగా ఎలా ఉండాలో చెప్పాడు. ఈ మ్యాచ్ లో నేను అదే ఫాలో అయ్యాను. నా సక్సెస్ కు కారణం ధోని సలహాలే” అంటూ చెప్పుకొచ్చాడు ఈ యువ కెరటం. మరి టీమిండియాలో బెస్ట్ ఫినిషర్ గా ఎదుగుతున్న రింకూ సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rinku Singh said, “I’ve interacted with Mahi bhai twice and he told me how to maintain calmness under pressure, yesterday I followed that”. pic.twitter.com/w6SM5NPXEu
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 24, 2023