SNP
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. రింకూ సింగ్ కొట్టిన ఓ సిక్స్ మాత్రం మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆ షాట్ చూసి... భారత ఆటగాళ్లతో పాటు సౌతాఫ్రికా క్రికెటర్లు సైతం షాక్‌కి గురయ్యారు. ఆ భారీ సిక్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. రింకూ సింగ్ కొట్టిన ఓ సిక్స్ మాత్రం మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆ షాట్ చూసి... భారత ఆటగాళ్లతో పాటు సౌతాఫ్రికా క్రికెటర్లు సైతం షాక్‌కి గురయ్యారు. ఆ భారీ సిక్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
రింకూ సింగ్.. ఇండియన్ క్రికెట్‌లో యువ సంచలనంగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే బెస్ట్ ఫినిషర్‌గా ప్రశంసలు అందుకున్న రింకూ.. తాజాగా మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన రింకూ మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి.. ఆచీతూచి ఆడుతూ.. మంచి పార్ట్నర్‌షిప్‌ను నెలకొల్పాడు. సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత.. ఇక టీమిండియా ఇన్నింగ్స్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్న రింకూ.. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా పరిణతి చూపిస్తూ.. సౌతాఫ్రికా బౌలర్లను వెంటాడాడు. 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేసి.. టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అయితే.. ఈ ఇన్నింగ్స్‌లో రింకూ చూపించిన కమిట్‌మెంట్‌తో పాటు.. అతను కొట్టిన ఓ భారీ సిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆ సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. సౌతాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి రెండు బంతులకు రింకూ రెండు భారీ సిక్సులు కొట్టాడు. అందులో ఓ సిక్స్ అయితే.. ఏకంగా స్టేడియంలోని మీడియా బాక్స్‌ను బద్దలుకొట్టింది. బాక్స్‌కు రక్షణగా ఉన్న భారీ అద్దం రింకూ సిక్స్ దెబ్బకు బద్దలైంది. ప్రస్తుతం ఆ సిక్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రింకూ సింగ్ సిక్స్ అంటే మినిమమ్ ఉంటుందంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 19.3 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో.. భారత ఇన్నింగ్స్‌ను అక్కడితో ఆపేసి.. సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152 పరుగుల టార్గెట్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇచ్చారు. ఈ టార్గెట్‌ను సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో ఛేదించింది. మొత్తం డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో ప్రాటీస్ జట్టు విజయం సాధించింది. భారత్ ఇన్నింగ్స్‌లో రింకూ సింగ్ 68, సూర్యకుమార్ యాదవ్ 56 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినా.. తలో చేయి వేసి గెలిచారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ గన్ రింకూ సింగ్ ఆడిన ఇన్నింగ్స్‌తో పాటు అతను కొట్టిన భారీ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rinku Singh has broken the glass of media box with a six. 🔥
– The future is here. pic.twitter.com/4hKhhfjnOr
— Johns. (@CricCrazyJohns) December 12, 2023