iDreamPost

పాక్ పై థ్రిల్లింగ్ విక్టరీ.. చిన్న పిల్లల్లా టీమిండియా ప్లేయర్స్ సెలబ్రేషన్స్! వీడియో వైరల్..

పాకిస్తాన్ పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంతో.. పిల్లల్లా మారిపోయి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు భారత యంగ్ ప్లేయర్లు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాకిస్తాన్ పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంతో.. పిల్లల్లా మారిపోయి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు భారత యంగ్ ప్లేయర్లు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాక్ పై థ్రిల్లింగ్ విక్టరీ.. చిన్న పిల్లల్లా టీమిండియా ప్లేయర్స్ సెలబ్రేషన్స్! వీడియో వైరల్..

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే సాధారణ క్రికెట్ ఫ్యాన్స్ కే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఓ రేంజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక ఈ దాయాది దేశాల మధ్య పోరును ఎవరు మాత్రం ప్రత్యక్షంగా చూడాలనుకోరు చెప్పండి. ఇలాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ ను గ్రౌండ్ లో ప్రత్యక్షంగా చూస్తేనే మస్త్ మజా వస్తుంది. ఇక వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 6 పరుగుల తేడాతో అనూహ్యంగా విజయం సాధించింది. ఇక ఈ విజయాన్ని టీమిండియ యంగ్ క్రికెటర్లు ప్రేక్షకుల మధ్యలో ఉండి.. చిన్న పిల్లల్లా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ ఆటగాళ్లు ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యచ్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. టాస్ వేసే క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మతిమరుపుతో మరోసారి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఇక భారత్ పై ఓటమితో పాపం పాకిస్తాన్ స్టార్ బౌలర్ నసీమ్ షా గ్రౌండ్ లోనే గుక్కపెట్టి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటితో పాటుగా ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. టీమిండియా విజయాన్ని ప్రేక్షకుల మధ్య ఉండి చిన్నపిల్లల్లా సెలబ్రేట్ చేసుకున్నారు భారత కుర్ర ప్లేయర్లు రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.

పాక్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడంతో.. పిల్లల్లా మారిపోయి మరీ ఎంజాయ్ చేశారు భారత ప్లేయర్లు రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని భారత విజయాన్ని పూర్తిగా ఆస్వాదించారు. ఈ చిరస్మరణీయ విజయాన్ని రింకూ తన సెల్ ఫోన్ లో బంధించుకుంటుంటే.. ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లు అరుస్తూ.. తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. రింకూ సింగ్ ను ఈ వరల్డ్ కప్ లోకి రిజర్వ్ ప్లేయర్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. మరి పిల్లల్లా మారి టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి