SNP
Rilee Rossouw, Jasprit Bumrah, Ashutosh Sharma: పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో జరిగిన రెండు సంఘటనలతో టీమిండియా ఫ్యూచర్ ఎంత అద్భుతంగా ఉండనుందో తెలిసిపోయింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Rilee Rossouw, Jasprit Bumrah, Ashutosh Sharma: పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో జరిగిన రెండు సంఘటనలతో టీమిండియా ఫ్యూచర్ ఎంత అద్భుతంగా ఉండనుందో తెలిసిపోయింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఛండీఘడ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఎంఐ 9 పరుగుల తేడాతో గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌తో ఇండియన్ క్రికెట్ భవిష్యత్తు ఎంత బలంగా ఉంటుందో అని చాటి చెప్పే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పెద్ద స్టార్లుగా ఉన్నారు. యువ క్రికెటర్లు ఎంత మంది వస్తున్నా.. వారిపైనే టీమిండియా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వారిద్దరు రిటైర్ అయితే.. టీమిండియా పరిస్థితి ఎలా ఉంటుందోనని చాలా మంది క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి భయం అవసరం లేదు అని అభయం ఇచ్చేలా ఒక విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
నిన్నటి మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చిమ్మాడు. అతని దెబ్బకు పంజాబ్ బ్యాటర్లు వణికిపోయారు. ముఖ్యంగా పంజాబ్ టాపార్డర్‌లోని సామ్ కరన్, రిలీ రోసోవ్‌లను బుమ్రా అవుట్ చేసి.. పంజాబ్‌కు స్టార్టింగ్‌లోనే షాకిచ్చాడు. ముఖ్యంగా బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్ 4వ బంతికి రోసోవ్ అవుటైన తీరు గురించి మాట్లాడుకుంటే.. బుమ్రా వేసిన సూపర్ యార్కర్‌కు రోసోవ్ వద్ద అసలు ఎలాంటి సమాధానం లేదు. పైగా రోసోవ్ సామాన్యమైన బ్యాటరేం కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి రికార్డు ఉన్న బ్యాటర్, అలాగే ఇతర లీగ్స్‌లో అదరగొడుతున్న ఆటగాడు. కానీ, బుమ్రా దెబ్బకు వికెట్ సమర్పించుకున్నాడు. అసలు వికెట్లు ఎలా పడ్డాయి.. బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతికి టప్పున కుప్పకూలాయి. ఆ బాల్‌ను చూసి అంతా షాక్ అయ్యారు.
అయితే.. ఇదే మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేస్తున్న బుమ్రా 5వ బంతిని సేమ్ అలానే సంధిస్తే.. భారత యువ క్రికెటర్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ అశుతోష్ శర్మ స్విప్ షాట్‌తో ఏకంగా సిక్స్ బాదాడు. ఆ షాట్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. మ్యాచ్ తర్వాత స్వయంగా బుమ్రానే అశుతోష్‌ని అభినందించాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ షాట్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఒక విషయం గమనించాలి. సేమ్ బౌలర్, సేమ్ బాల్.. కానీ, ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ క్లీన్ బౌల్డ్ అయిన చోట, ఒక భారత యువ క్రికెటర్ దాన్ని ఇన్నోవేటివ్ షాట్‌తో సిక్స్‌కు పంపించాడు. ఒక వరల్డ్ క్లాస్ బౌలర్, అందులోనా యార్కర్లను కచ్చితమైన లైన్ అండ్ లెంత్‌తో డెడ్ యాక్యూరేట్‌గా వేసే బౌలర్‌కు వ్యతిరేకంగా కుర్రాడు అలాంటి షాట్ ఆడాడు అంటే అతని ధైర్యాన్ని ఎక్కువగా మెచ్చుకోవాలి. అసలు బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడంటేనే చాలా మంది బ్యాటర్లు వికెట్ కాపాడుకోవడానికే చూస్తారు. కానీ, అశుతోష్ మాత్రం ఎంతో అద్భుతంగా, ధైర్యం సిక్స్ కొట్టాడు. ఈ ఒక్క షాట్ చాలు.. ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ఎంత గొప్పగా ఉండనుందో చెప్పడానికి అని క్రికెట్ నిపుణులు సైతం అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We are here to say again: 𝗧𝗛𝗜𝗦 is what we pay our internet bills for 🥹🔥🔥#MumbaiMeriJaan #MumbaiIndians #PBKSvMIpic.twitter.com/ySPfDHTAlm
— Mumbai Indians (@mipaltan) April 18, 2024
ASHUTOSH SHARMA PLAYED ONE OF THE BEST SHOT IN IPL 2024. 🥶 pic.twitter.com/WhO7RgfNEF
— Johns. (@CricCrazyJohns) April 18, 2024