విరాట్ కోహ్లీ ఆ ప్రపంచ కప్ ఆడాలని వారొక్కరు తప్పితే.. ఎవరూ కోరుకోవడం లేదని ఆసీస్ దిగ్గజ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి విరాట్ ఆ వరల్డ్ కప్ ఆడాలని కోరుకునేది ఎవరు? ఆడలేడు అని చెప్పేది ఎవరు? ఆ వివరాలు చూద్దాం.
విరాట్ కోహ్లీ ఆ ప్రపంచ కప్ ఆడాలని వారొక్కరు తప్పితే.. ఎవరూ కోరుకోవడం లేదని ఆసీస్ దిగ్గజ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి విరాట్ ఆ వరల్డ్ కప్ ఆడాలని కోరుకునేది ఎవరు? ఆడలేడు అని చెప్పేది ఎవరు? ఆ వివరాలు చూద్దాం.
వరల్డ్ కప్ 2023లో సూపర్ ఫామ్ లో దూసుకెళ్తున్నాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో రెండు సెంచరీల సాయంతో.. 543 రన్స్ చేసి ఈ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో ఉన్న డికాక్ కు అతడికి కేవలం 7 రన్స్ మాత్రమే తేడా ఉంది. కాగా.. ప్రస్తుతం విరాట్ ఫామ్ చూస్తే వరల్డ్ కప్ లో లీడింగ్ స్కోరర్ కావడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. తాజాగా సచిన్ వరల్డ్ రికార్డును సమం చేయడంతో.. విరాట్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ గొప్ప బ్యాటర్ అని చెప్పడానికి సచిన్ రికార్డులు బద్దలు కొట్టే అవసరం లేదని, అతడి భారం దిగిపోయిందని ఇప్పుడు అతడు మరింత స్వేచ్చగా ఆడతాడని కితాబిచ్చాడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్. ఈ క్రమంలోనే విరాట్ నెక్ట్స్ వరల్డ్ కప్ ఆడే విషయం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు పాంటింగ్.
తన కెరీర్ లోనే అత్యున్నత ఫామ్ లో ఉన్నాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. పరుగులు వరదపారిస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రెండో ప్లేస్ లో కొనసాగుతున్నాడు విరాట్ భాయ్. భారత జట్టు సాధిస్తున్న విజయాల్లో తన వంతు కీలక పాత్రపోషిస్తున్నాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. విరాట్ కోహ్లీ వచ్చే వరల్డ్ కప్ ఆడతాడా? లేదా? అన్న సందేహం అందరిలో ఉంది. ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆసీస్ దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్. విరాట్ సచిన్ సెంచరీల రికార్డు సమం చేసినప్పుడు ప్రశంసించిన పాంటింగ్ నుంచి ఇలాంటి కామెంట్స్ ఊహించి ఉండరు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన పాంటింగ్..
“కేవలం ఇండియన్ ఫ్యాన్స్ తప్పితే.. విరాట్ కోహ్లీ నెక్ట్స్ వరల్డ్ కప్ ఆడాలని ఏ ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కూడా అనుకోవట్లేదు. ఈ విషయంపై వారు స్పష్టంగా తమ అభిప్రాయాలను వెల్లిబుచ్చుతున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ దిగ్గజ బ్యాటర్. కాగా.. ప్రస్తుతం 35 సంవత్సరాల విరాట్ కోహ్లీ వచ్చే వరల్డ్ కప్ ఆడటం నిజంగా కష్టమే. అప్పటికి కోహ్లీ 40వ పడిలో అడుగుపెడతాడు. ఈ వయసులో కోహ్లీ ప్రస్తుత ఫామ్ ను కొనసాగిస్తూ.. జట్టులో ప్లేస్ ను కాపాడుకోవడం అంటే అసాధ్యమనే చెప్పాలి. అయితే విరాట్ ఫిట్ నెస్ ను బట్టి చూస్తే.. వచ్చే ప్రపంచ కప్ ఆడతాడని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ.. విరాట్ కోహ్లీ వచ్చే వరల్డ్ కప్ ఆడాలని ఎవరికీ లేదని చెప్పిన రికీ పాంటింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ricky Ponting said, “any other cricket fan other than Indian fans wouldn’t want Virat Kohli to play the next world cup”. pic.twitter.com/GwraPWKaGS
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 7, 2023