iDreamPost

బెన్ స్టోక్స్ పై రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం! యాషెస్ చరిత్రలోనే గొప్ప అంటూ..

  • Author Soma Sekhar Published - 12:15 PM, Tue - 4 July 23
  • Author Soma Sekhar Published - 12:15 PM, Tue - 4 July 23
బెన్ స్టోక్స్ పై రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం! యాషెస్ చరిత్రలోనే గొప్ప అంటూ..

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య ప్రతిష్టాత్మకమైన యాషెస్ సమరం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమరంలో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా 2-0తో ఆధిక్యంలో ఉంది ఆసీస్. తాజాగా లార్డ్స్ వేదిగకగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం అంచులదాక వెళ్లి పరాజయంపాలైంది. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారీ శతకంతో దుమ్మురేపాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. 214 బంతులు ఎదుర్కొని 155 పరుగులు చేశాడు. కానీ తన టీమ్ కు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్.

బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ తో క్రీడా ప్రపంచంలో యాషెస్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్ హాట్ టాపిక్ గా మారింది. అతడు అవుట్ కాకుండే కచ్చితంగా ఇంగ్లాండే విజయం సాధించి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గెలిచిన ఆసీస్ ఆటగాళ్లను పొగడకుండా.. ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు ఆసీస్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. స్టోక్స్ సెంచరీ చేసిన విధానం అద్భుతం అంటూ కితాబిచ్చాడు పాంటింగ్. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..

“బెన్ స్టోక్స్ ఎప్పుడూ తనదైన రీతిలోనే బ్యాటింగ్ లో చెలరేగుతుంటాడు. అయితే బెయిర్ స్టో అవుట్ అయిన తర్వాత బ్రాడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటి నుంచి స్టోక్స్ బ్యాటింగ్ చేసిన విధానం అమోఘం అనే చెప్పాలి. చాలా మంది ఆటగాళ్లు తమదైన శైలిలో బ్యాటింగ్ చేస్తు.. గాల్లోకి బంతులను కొడుతుంటారు. కానీ ఈ మ్యాచ్ లో స్టోక్స్ కొట్టిన 155 రన్స్ యాషెస్ చరిత్రలోనే బెస్ట్ సెంచరీ” అంటూ స్టోక్స్ పై ప్రశంసలు కురిపించాడు. ఇక బెయిర్ స్టో అవుట్ ని ఆసీస్ సారథి ప్యాట్ కమ్మిన్స్ సమర్థించుకుంటే.. స్టోక్స్ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. అలాంటి గెలుపు మాకు అవసరం లేదంటూ.. ఆసీస్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏది ఏమైనప్పటికీ స్టోక్స్ పై దిగ్గజ ఆటగాడు పాంటింగ్ ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి