ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్‌గా ఒక రాక్షసుడు? అదే జరిగితే టీమిండియా పతనం పక్కా!

Ricky Ponting, BCCI, Head Coach: టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా తీసుకునేందుకు బీసీసీఐ ఓ రాక్షసుడిని పరిశీలిస్తోంది. అతనొస్తే టీమిండియా పతనం గ్యారెంటీ అని ఫ్యాన్స్‌ భయపడుతున్నారు. మరి అతను ఎవరు? ఎందుకు ఫ్యాన్స్‌ భయపడుతున్నారో ఇప్పుడు చూద్దాం..

Ricky Ponting, BCCI, Head Coach: టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా తీసుకునేందుకు బీసీసీఐ ఓ రాక్షసుడిని పరిశీలిస్తోంది. అతనొస్తే టీమిండియా పతనం గ్యారెంటీ అని ఫ్యాన్స్‌ భయపడుతున్నారు. మరి అతను ఎవరు? ఎందుకు ఫ్యాన్స్‌ భయపడుతున్నారో ఇప్పుడు చూద్దాం..

ఒక వైపు ఐపీఎల్‌ మానియాతో క్రికెట్‌ అభిమానులు ఊగిపోతుంటే.. మరోవైపు టీమిండియాకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. భారత జట్టుకు కొత్త కోచ్‌ను నియమించే పనిలో ఉంది క్రికెట్‌ బోర్డు. టీ20 వరల్డ​్‌ కప్‌ 2024 తర్వాత టీమిండియాకు కొత్త కోచ్‌ నియమించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తి అయిన తర్వాత ద్రవిడ్‌ స్థానంలో కొత్త కోచ్‌ను నియమించనున్నారు. మరింత కాలం కొనసాగేందుకు ద్రవిడ్‌ సిద్ధంగా లేకపోవడంతో కొత్త కోచ్‌ వేటలో పడింది బీసీసీఐ. ఈ క్రమంలోనే.. ఓ షాకింగ్‌ విషయం తెలుస్తోంది. టీమిండియాకు కొత్త కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఎంపిక అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే.. ఈ విషయంపై భారత క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పాంటింగ్‌ లాంటి దిగ్గజ క్రికెటర్‌ కోచ్‌గా ఉండాలని చాలా జట్లు కోరుకుంటున్నాయి.. కానీ, టీమిండియా ఫ్యాన్స్‌ మాత్రం పాంటింగ్‌ అస్సలు వద్దు.. అతను కోచ్‌గా ఉంటే టీమిండియా పతనం అవుతుందని భయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్యాన్స్‌ భయానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఫస్ట్‌ థింగ్‌.. ఆస్ట్రేలియన్‌ క్రికెటర్లకు ఇండియా అన్న, ఇండియన్‌ క్రికెటర్‌ అన్నా.. చిన్న చూపు. కొన్ని ఏళ్లుగా వాళ్ల ధోరణి అంతే. వాళ్లు చేసే కామెంట్లు, ఇచ్చే స్టేట్‌మెంట్లు భారత క్రికెట్‌పై, క్రికెటర్లపై వారికుండే.. చిన్న చూపు, వారి అహంకారం బయటపడుతూ ఉంటుంది.

గతంలో గ్రెగ్‌ చాపెల్‌ టీమిండియా కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియా ఎలా నాశనం అయిందో అందరికీ తెలిసిందే. 2003లో వన్డే వరల్డ్‌ కప్‌ ఆడిన టీమ్‌, జట్టును ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన కెప్టెన్‌ను చాపెల్‌ చాలా ఇబ్బంది పెట్టాడు. ఆటే ప్రాణంగా ఉన్న టీమ్‌ను వివాదాల పుట్టగా మార్చాడు. టీమిండియా దశాదిశను మార్చిన గంగూలీని టీమ్‌లో లేకుండా చేసి.. టీమిండియాను సర్వనాశనం చేశాడు. చాపెల్‌ చేసిన రచ్చతో 2007 వన్డే వరల్డ్‌ కప్‌లో గ్రూప్‌ స్టేజ్‌ను కూడా దాటలేకపోయింది. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్ల టెక్నిక్‌ అంటే వాళ్లకు గిట్టదు. అసలు మనోళ్లు ఆడేది క్రికెట్టే కాదు ఫీలైపోతుంటారు ఆస్ట్రేలియన్లు. వాళ్ల చాదస్తం అంతా తెచ్చి.. టీమిండియాపై రుద్దాలని అనుకుంటారు.

ఇప్పుడు రికీ పాంటింగ్‌ విషయానికి వస్తే.. అతను గొప్ప కెప్టెన్‌, అంతకంటే గొప్ప ఆటగాడు అందులో ఎలాంటి డౌట్‌ లేదు. కానీ, అతని ఆస్ట్రేలియన్‌ వ్యక్తిత్వం మాత్రం మనకు కచ్చితం చేటు చేసేదే. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించిన సమయంలో.. ‘క్రికెట్ మాఫియాపై నిజమైన క్రికెట్ గెలిచింది’ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది పాంటింగ్‌కి ఇండియన్‌ క్రికెట్‌పై ఉన్న అభిప్రాయం. అలాంటి వ్యక్తి వచ్చి.. టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా ఉంటే ఎలా అంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. పైగా మన ఆటగాళ్ల న్యాచురల్‌ టెక్నిక్‌ను మార్చాలని చూస్తారు ఆస్ట్రేలియన్‌ కోచ్‌లు. అది ఎంతటి చెత్త ఫలితాలు ఇస్తాయో గతంలో చూశాం. పైగా కోచ్‌గా పాంటింగ్‌ రికార్డ్ కూడా అంత ఏం బాలేదు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా అతను ఏం సాధించింది లేదు. అందుకే.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా పాంటింగ్‌ లాంటి రాక్షసుడిని వద్దంటున్నారు భారత క్రికెట్‌ అభిమానులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments