iDreamPost
android-app
ios-app

క్రికెట్‌ హిస్టరీలో అతనే గొప్ప క్రికెటర్‌! సచిన్‌, కోహ్లీకి షాకిచ్చిన రికీ పాంటింగ్‌

  • Published Oct 05, 2024 | 6:11 PM Updated Updated Oct 05, 2024 | 6:11 PM

Ricky Ponting, Jacques Kallis, Brian Lara: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్‌ ఎవరో పాంటింగ్‌ చెప్పేశాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో పాంటింగ్‌ ఎందుకలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Ricky Ponting, Jacques Kallis, Brian Lara: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్‌ ఎవరో పాంటింగ్‌ చెప్పేశాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో పాంటింగ్‌ ఎందుకలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Oct 05, 2024 | 6:11 PMUpdated Oct 05, 2024 | 6:11 PM
క్రికెట్‌ హిస్టరీలో అతనే గొప్ప క్రికెటర్‌! సచిన్‌, కోహ్లీకి షాకిచ్చిన రికీ పాంటింగ్‌

ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ భారత క్రికెటర్లకు ఊహించని షాకిచ్చాడు. క్రికెట్‌ చరిత్రలో గొప్ప ప్లేయర్‌ ఎవరంటే.. వందలో 90 మంది చెప్పే పేరు సచిన్‌ టెండూల్కర్‌. అలాగే.. మోడ్రన్‌ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ వరల్డ్స్‌ బెస్ట్‌ క్రికెటర్‌గా పేర్కొంటారు. కానీ, పాంటింగ్‌ మాత్రం.. ఈ ఇద్దరి పేర్లు ఎత్తకుండా.. మరో క్రికెటర్‌ను ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ప్లేయర్‌గా అభివర్ణించాడు. ఇంతకీ పాంటింగ్‌ చెప్పిన ఆ గొప్ప క్రికెటర్‌ ఎవరో తెలుసా.. సౌతాఫ్రికా మాజీ దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కల్లీస్‌. తాను చూసిన.. అత్యుత్తమ క్రికెటర్‌ కల్లీస్‌ అని పాంటింగ్ పేర్కొన్నాడు. సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ పేర్లు చెప్పకపోవడంతో చాలా మంది క్రికెట్‌ అభిమానులు బాధపడుతున్నా.. కల్లీస్‌పై ఉన్న సాఫ్ట్‌ కార్నర్‌తో ఓకే ఓకే అంటున్నారు.

పాంటింగ్‌ మాట్లాడుతూ.. ‘నేను చూసిన ప్లేయర్లలో జాక్వస్ కల్లీస్ అత్యుత్తమ క్రికెటర్. కల్లీస్‌ ఒక గొప్ప ఆల్‌రౌండర్. గ్రేటెస్ట్‌ బ్యాటర్‌ ఎవరనే విషయం గురించి.. నేను మాట్లాడటం లేదు.. అత్యంత నైపుణ్యం కలిగిన క్రికెటర్ గురించి మాట్లాడుతున్నాను. జాక్వస్ కల్లీస్ టెస్ట్‌ల్లో 45 సెంచరీలు చేశాడు. బౌలింగ్‌తో దాదాపు 300 వికెట్లు తీసాడు. వీటన్నిటికంటే.. టెస్ట్‌ క్రికెట్‌లో అసాధారణమైన క్యాచ్‌ల రికార్డ్ అందుకున్నాడు. అయితే.. కల్లీస్‌కు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అతనో గొప్ప ఆల్‌రౌండర్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడినట్లు.. కల్లీస్‌ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. నా దృష్టిలో మాత్రం అతనే ఆల్‌టైమ్ బెస్ట్ క్రికెటర్.’అని పాంటింగ్ పేర్కొన్నాడు. అలాగే.. న్యాచురల్‌ టాలెంట్‌ కలిగిన బెస్ట్‌ బ్యాటర్‌ ఎవరంటే.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరు చెప్పాడు పాంటింగ్.

పాంటింగ్‌ లాంటి దిగ్గజ క్రికెటర్‌ ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చాడంటే.. దానికో లెక్క ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కల్లీస్‌, లారా దిగ్గజ క్రికెటర్లే. జాక్వస్ కల్లీస్ సౌతాఫ్రికా తరఫున 166 టెస్ట్‌లు, 328 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 13289, వన్డేల్లో 11579, టీ20ల్లో 666 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో టెస్ట్‌ల్లో 292, వన్డేల్లో 273, టీ20ల్లో 12 వికెట్లు కూడా తీసి.. అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఇక బ్రియాన్ లారా వెస్టిండీస్ తరఫున 131 టెస్ట్‌ల్లో 11,953, 299 వన్డేలు ఆడి 10,405 రన్స్‌ చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 53 సెంచరీలు సాధించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన రికార్డు లారా పేరిటే ఉంది. అయితే.. చాలా మంది క్రికెట్‌ అభిమానులు అత్యుత్తమ బ్యాటర్‌ విషయంలో పాంటింగ్‌ అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. ఎందుకంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు, అందరికంటే ఎక్కువ పరుగులు కొట్టిన క్రికెటర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ దేవుడిగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.