iDreamPost

టీమిండియా పాలిట విలన్‌లా మారిన అంపైర్‌! ఈ ఫైనల్‌లో కూడా..

  • Published Nov 19, 2023 | 10:29 PMUpdated Nov 21, 2023 | 11:28 AM

మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలుద్దాం అనుకున్న టీమిండియా ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లింది. ఫైనల్లో అద్భుతంగా ఆడి ఆరోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. అయితే.. భారత ఓటమితో అంపైర్‌కు కూడా కొన్ని మైనస్‌ మార్కుల ఇవ్వాలి. ఇప్పటికే మనకు బ్యాడ్‌ లక్‌ అంపైర్‌గా మారిన అతను.. ఈ మ్యాచ్‌లో ఏకంగా మనకు నష్టం చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. దీంతో.. మూడో సారి విశ్వవిజేతగా నిలవాలన్న కల కల్లలైంది. ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి, ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్లో అడుగుపెట్టిన భారత్‌.. చివరి మెట్టుపై ఆసీస్‌పై ఓటమి చెంది.. వరల్డ్‌ కప్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా టాస్‌ అని చెప్పవచ్చు. టాస్‌ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్‌ చేయడం కలిసొచ్చింది. పిచ్‌, వాతావరణ పరిస్థితులు వారికి అనుకూలంగా మారాయి. అలాగే ఆస్ట్రేలియా కూడా అద్భుతంగా ఆడింది. వీటన్నింటికీ తోడు.. ఓ అంపైర్‌ కూడా టీమిండియా ఓటమికి కారణంగా నిలిచాడు. అతని కథేంటో ఇప్పుడు చూద్దాం..

రిచర్డ్ కెటిల్‌బరో.. ఈ అంపైర్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అనేక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో టీమిండియాకు బ్యాడ్‌ లక్‌ అంపైర్‌గా ఉన్నాడు. అయితే.. ఈ ఫైనల్‌లో అతను బ్యాడ్‌లక్‌ అంపైర్‌గా ఉండటమే కాదు.. టీమిండియాకు నష్టం చేసేలా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 28వ ఓవర్‌ ఐదో బంతిని లబుషేన్‌ ఫ్లిక్‌ ఆడబోయాడు. కానీ, బాల్‌ ప్యాడ్లకు తాకింది. బుమ్రా ఎంతో కాన్ఫిడెంట్‌గా అప్పీల్‌ చేసినా.. కెటిల్‌బరో దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. అయినా కూడా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుమ్రాతో ఏకీభవించి రివ్యూ తీసుకున్నాడు.

అందులో అంతా బాగానే ఉన్నా.. బాల్‌ లెగ్‌ స్టంప్స్‌కు తాకుతుండటంతో అంపైర్స్‌ కాల్‌ కింద థర్డ్‌ అంపైర్‌ సైతం దాన్ని నాటౌట్‌గా ప్రకటించాల్సి వచ్చింది. ఒక వేళ అంపైర్‌ కెటిల్‌బరో అవుట్‌ ఇచ్చి ఉంటే.. టీమిండియాకు నాలుగో వికెట్‌ దక్కి ఉండేది. ఆస్ట్రేలియా మరింత ఒత్తిడిలోకి వెళ్లి ఫలితం వేరేలా ఉండేది. కానీ, ఇండియాకు బ్యాడ్‌ లక్‌ అంపైర్‌కు అవతరించిన కెటిల్‌బరో ఈసారి తన నిర్ణయంతో దాన్ని మరోసారి నిరూపించాడు. ఇప్పుడనే కాదు.. 2014 టీ20 వరల్డ్‌ కప్‌, 2015 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌, 2016 టీ20 వరల్డ్‌ కప్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌ కప్‌.. మళ్లీ ఇప్పుడు ఈ వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కెటిల్‌బరో అంపైర్‌గా ఉండటం టీమిండియాకు అస్సలు కలిసి రాలేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి