iDreamPost

IND vs SA: టీమిండియాదే టెస్ట్ సిరీస్? ఆ సెంటిమెంటే కారణం!

టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. సెంటిమెంట్ ప్రకారం ఇదే జరిగితే సౌతాఫ్రికాలో భారత్ చరిత్ర సృష్టించడం ఖాయం. మరి ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. సెంటిమెంట్ ప్రకారం ఇదే జరిగితే సౌతాఫ్రికాలో భారత్ చరిత్ర సృష్టించడం ఖాయం. మరి ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

IND vs SA: టీమిండియాదే టెస్ట్ సిరీస్? ఆ సెంటిమెంటే కారణం!

ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. తొలి పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం(డిసెంబర్ 26) సెంచూరియన్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్ నెగ్గి సఫారీ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తుండగా.. తమ గత రికార్డులను పదిలపరుచుకోవాలని సౌతాఫ్రికా ఆరాటపడుతోంది. దీంతో ఈ పోరు హోరాహోరిగా సాగుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదీకాక ఈ సిరీస్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటుగా మరికొంతమంది ఆటగాళ్లు జట్టులోకి చేరారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. సెంటిమెంట్ ప్రకారం ఇదే జరిగితే సౌతాఫ్రికాలో భారత్ చరిత్ర సృష్టించడం ఖాయం. మరి ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఏ రంగంలోనైనా సెంటిమెంట్స్ ఉండటం అనేవి కామన్. ఇక ఆ సెంటిమెంట్స్ చాలా సందర్భాల్లో నిజాలుగా మన కళ్ల ముందు నిలబడటం మనం చూసే ఉన్నాం. అలాంటి ఓ సెంటిమెంటే టీమిండియాకు సఫారీ సిరీస్ లో భారీ ఊరటను ఇస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా విజయవంతం అవుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ నుంచి రిచిర్డ్ కెటిల్ బరో వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. అతడి స్థానాన్ని ఐసీసీ లాంగ్టన్ రేసేరేతో భర్తీ చేసింది. ఈ న్యూస్ టీమిండియా అభిమానులకు తెగ సంతోషాన్ని ఇస్తోంది.

ఐసీసీ తొలుత ఈ సిరీస్ కు అంపైర్లుగా కెటిల్ బరో, పాల్ రీఫిల్ అహ్సన్ రజాను ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల కెటిల్ బరో తప్పుకున్నారు. టీమిండియా పాలిట ఐరన్ లెగ్ గా మారిన అంపైర్ తప్పుకోవడంతో.. భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం మనందరికి తెలిసిందే. ఎందుకంటే? కెటిల్ బరో అంపైర్ గా వ్యవహరించిన చాలా మ్యాచ్ లో టీమిండియా అపజయాలనే మూటగట్టుకుంది. తాజాగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ తో సహా.. అంతకు ముందు జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ 2023 ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తో పాటుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో కూడా ఓడిపోయింది. దీంతో అప్పటి నుంచి ఇండియా పాలిట ఐరన్ లెగ్ అంపైర్ గా మారాడు. తాజాగా సఫారీ సిరీస్ నుంచి అతడు తప్పుకోవడంతో.. టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి