SNP
Virat Kohli, IND vs USA, T20 World Cup 2024: టీమిండియాకు పెద్ద దిక్కులాంటి విరాట్ కోహ్లీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. అయితే.. అతని వైఫల్యానికి ఓ తప్పు కారణంగా చెప్పుకోవచ్చు అందేంటో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, IND vs USA, T20 World Cup 2024: టీమిండియాకు పెద్ద దిక్కులాంటి విరాట్ కోహ్లీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. అయితే.. అతని వైఫల్యానికి ఓ తప్పు కారణంగా చెప్పుకోవచ్చు అందేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియాకు బ్యాటింగ్‌లో అతనే ప్రధాన బలం. అతనొక్కడు నిల్చున్నా చాలు.. ఎదురుగా ఎలాంటి ప్రత్యర్థి ఉన్నా మట్టి కరవాల్సిందే. గెలుపు ప్రత్యర్థి నోట్లో ఉన్నా.. దాన్ని దవడలు విరగొట్టి.. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టుకు ఊపిరి అందిచగలడు. లక్ష్యం ఎంత పెద్దదైనా లెక్కేసి మరి కొడతాడు.. అందుకే అంతా అతన్ని ఛేజ్ మాస్టర్ అంటారు. క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న రాజు కాబట్టి కింగ్ కోహ్లీ అంటారు. అయితే.. టీ20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆ వీరుడి ఖడ్గం కాస్త మూగబోతోంది. ఐర్లాండ్, యూఎస్‌ఏ లాంటి పసికూనలతో మ్యాచ్‌లు ఆడినా.. కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. చిన్న టీమ్స్‌తో మ్యాచ్‌లు కాబట్టి కోహ్లీ వైఫల్యం పెద్దగా ప్రభావం చూపడం లేదు. కానీ, సూపర్ 8 దశలో పెద్ద టీమ్స్ తగులుతాయి.. అప్పుడు కూడా కోహ్లీ ఇలానే ఆడితే టీమిండియాకు కష్టాలు తప్పవు అంటున్నారు క్రికెట్ నిపుణులు.
ఈ టోర్నీ కంటే ముందు ఐపీఎల్ 2024లో అద్భుతంగా ఆడిన కోహ్లీ ఇప్పుడు మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. మరి అతని వైఫల్యానికి కారణం ఏంటి? వరుసగా ఎందుకు విఫలం అవుతున్నాడు? అది కూడా పెద్దగా పసలేని పసికూన జట్లపై కోహ్లీ ఫెల్యూర్‌కు కారణం ఏంటని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఈ వైఫల్యానికి కోహ్లీ చేసిన ఒక్క తప్పు కారణం అంటూ కొంతమంది క్రికెట్ పండితుల నుంచి ఒక వాదన వినిపిస్తోంది. అదేంటంటే.. విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ కోసం చాలా ఆలస్యంగా టీమ్‌తో చేరాడు. జట్టు మొత్తం అమెరికాకు వచ్చి చాలా ప్రాక్టీస్ చేసింది. కానీ, కోహ్లీ మాత్రం టోర్నీ ఆరంభానికి కొద్ది రోజుల ముందు మాత్రమే టీమ్‌లో చేరాడు.
ఈ టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన ఒకే ఒక వామప్ మ్యాచ్ కూడా అతను ఆడలేదు. నేరుగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడాడు. తొలి మ్యాచ్‌లో ట్రిక్కి పిచ్‌పై 5 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయాడు. తర్వాత పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 3 బంతుల్లో 4 పరుగులు చేసి వికెట్ పారేసుకున్నాడు. తాజాగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. న్యూయార్క్ పిచ్‌పై ఏ మాత్రం ప్రాక్టీస్ లేకుండా నేరుగా మ్యాచ్ ఆడటం, ఆ మ్యాచ్‌లో విఫలం కావడంతో కోహ్లీలో ఒక డౌట్ క్రియేట్ అయింది. ఈ పిచ్‌పై చాలా జాగ్రత్తగా ఆడాలా? అగ్రెసివ్‌గా ఆడాలా? అనే డైలమాలోనే కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో విఫలం అయిపోయాడు. టోర్నీ ఆరంభానికి ముందు జట్టుతో పాటే వచ్చి, ప్రాక్టీస్ చేసి, బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాచ్ ఆడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఓపెనర్‌గా ఆడటం వల్ల విఫలం అవుతున్నాడని అంటున్నారు కానీ, అందులో అర్థం లేదు. కోహ్లీ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అదరగొట్టిన విషయం తెలిసిందే. మరి టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ మూడు వరుస వైఫల్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli for the first time ever got out on duck in the T20 World Cups. pic.twitter.com/nADmN6kwqZ
— Virat Kohli Fan Club (@Trend_VKohli) June 13, 2024