గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా కొంప ముంచిన పెనాల్టీ!

  • Author Soma Sekhar Updated - 09:28 AM, Wed - 29 November 23

ఐసీసీ తీసుకొచ్చిన కొత్త రూల్ టీమిండియా కొంపముంచింది. భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఐసీసీ తీసుకొచ్చిన ఆ రూలే ఓటమికి కారణం అయ్యిందా? ఇంతకీ ఆ రూల్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐసీసీ తీసుకొచ్చిన కొత్త రూల్ టీమిండియా కొంపముంచింది. భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఐసీసీ తీసుకొచ్చిన ఆ రూలే ఓటమికి కారణం అయ్యిందా? ఇంతకీ ఆ రూల్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Updated - 09:28 AM, Wed - 29 November 23

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) అవసరాన్ని బట్టి, పరిస్థితులకు అనుగుణంగా క్రికెట్ నిబంధనలు మార్చుతూ.. కొత్త రూల్స్ ను తీసుకొస్తుండటం సాధారణమైన విషయమే. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ రూల్స్ మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేస్తాయి. తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3వ టీ20 మ్యాచ్ లో ఇదే జరిగింది. ఐసీసీ తీసుకొచ్చిన కొత్త రూల్ టీమిండియా కొంపముంచింది. భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఐసీసీ తీసుకొచ్చిన ఆ రూలే ఓటమికి కారణం అయ్యిందా? ఇంతకీ ఆ రూల్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మకమైన 3వ టీ20లో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మూకుమ్మడిగా విఫలం అయ్యారు. ఆసీస్ స్టార్ బ్యాటర్ మ్యాక్స్ వెల్ విధ్వంసకర బ్యాటింగ్ తో తన జట్టును గెలిపించాడు. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ.. ఒంటి చేత్తో మ్యాచ్ ను ముగించాడు. కాగా టీమిండియా ఓటమికి బౌలర్ల వైఫల్యం, మ్యాక్స్ వెల్ బ్యాటింగ్, సూర్య కెప్టెన్సీతో పాటుగా మరో రీజన్ కూడా ఉంది. ఐసీసీ ఇటీవలే తీసుకొచ్చిన కొత్త రూల్ భారత జట్టు కొంపముంచింది. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే?

స్లో ఓవర్ రేటింగ్ కారణంగా మ్యాచ్ లు లేట్ గా ముగుస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఐసీసీ పలు కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. అందులో ఒకటి ఓవర్ రేట్ పెనాల్టీ. ఈ రూల్ లో భాగంగా బౌలర్లు లేట్ గా బౌలింగ్ స్టార్ట్ చేస్తే.. ఆ ఓవర్ లో ఐదుగురు ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ లోపలే ఉండాలి. నలుగులు మాత్రమే బయట ఉండాలి. ఈ మ్యాచ్ లో ఇదే జరిగింది. ప్రసిద్ధ్ కృష్ణ చివరి ఓవర్ వేయడానికి వచ్చిన సమయంలో స్లో ఓవర్ రేట్ పెనాల్టీ విధించడంతో.. ఐదుగురు ఆటగాళ్లు సర్కిల్ లోపలే ఉండాల్సి వచ్చింది. దీంతో మ్యాక్స్ వెల్ యథేచ్చగా షాట్లు ఆడి.. మ్యాచ్ ను ముగించాడు.

ఈ రూల్ కనక లేకపోతే.. భారత్ గెలిచేదే. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ వేసి 18వ ఓవర్ లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక 19వ ఓవర్లో అక్షర్ పటేల్ 22 రన్స్ ఇవ్వడంతో.. ప్రసిద్ధ్ పై ఒత్తిడి పెరిగింది. పైగా పెనాల్టీ పడటంతో.. ఆ ప్రజర్ కాస్త ఎక్కువైంది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న మ్యాక్సీ.. కథ ముగించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(123) అజేయ శతకం సాధించాడు. అనంతరం 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఒంటి చేత్తో గెలిపించాడు మ్యాక్స్ వెల్. ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది.

Show comments