SNP
Shivam Dube, CSK vs PBKS, IPL 2024: నిన్న మొన్నటి వరకు అదరగొడుతున్న శివమ్ దూబే.. తాజాగా వరుస డకౌట్లతో ఇబ్బంది పడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన తర్వాతనే ఇలా జరుగుతోంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Shivam Dube, CSK vs PBKS, IPL 2024: నిన్న మొన్నటి వరకు అదరగొడుతున్న శివమ్ దూబే.. తాజాగా వరుస డకౌట్లతో ఇబ్బంది పడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన తర్వాతనే ఇలా జరుగుతోంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా యువ క్రికెటర్ శివమ్ దూబే ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా ఆడుతుండటంతో అతన్ని ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. అయితే.. ఒక్కసారి టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో తన పేరు వచ్చిన తర్వాత.. దూబే ఆట పూర్తిగా మారిపోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. ఈ నెల 1వ తేదీన పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో లెబ్ బిఫోర్‌గా అవుట్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి పంజాబ్‌తోనే ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ సారి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు.
ఈ సీజన్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతూ.. అందరి దృష్టిని ఆకర్షించి దూబే.. ఒక్కసారి టీమిండియాకు సెలెక్ట్ అవ్వగానే వరుస గోల్డెన్ డక్‌లో అందరిని కంగారు పెడుతున్నాడు. మొన్నటి వరకు అంత బాగా ఆడిన ఆటగాడు ఇప్పుడెందుకు ఇలా ఆడుతున్నాడు అంటూ భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఫామ్‌ను టీ20 వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తే.. జట్టుకు భారంగా మారుతాడని, అంతిమంగా టీమ్‌కు నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన దూబే 350 పరుగులు చేశాడు. నిజానికి దూబే ఈ 350 పరుగులను కేవలం 9 మ్యాచ్‌ల్లోనే చేశాడు. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్ అయ్యాడు.
దీంతో.. శివమ్ దూబే వరుస వైఫల్యాలపై క్రికెట్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. టీ20 వరల్డ్ కప్ 2024కు ఎంపిక అయిన తర్వాత దూబేపై ఒత్తిడి పెరిందని, ఆ ఒత్తిడితోనే అతను వరుస మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడనే వాదనలు వినిపిస్తున్నాయి. దూబే కెరీర్‌లో రాబోయే టీ20 వరల్డ్ కప్ తొలి ఐసీసీ టోర్నీ. అంత పెద్ద ఈవెంట్‌లో ఆడేందుకు టీమిండియాకు ఎంపికైన తర్వాత.. దూబే వరల్డ్ కప్‌లోనూ ఇదే విధంగా రాణించాలని భావిస్తూ.. ఇప్పుడు ఒత్తిడి గురవుతున్నాడు. ఈ విషయంలో దూబేతో సీనియర్ క్రికెటర్లు మాట్లాడాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా రోహిత్ శర్మ దూబేతో మాట్లాడిన అతన్ని కాస్త కామ్‌డౌన్ చేయాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. మరి దూబే వరుస డకౌట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shivam Dube against Punjab Kings: 0(1) & 0(1). pic.twitter.com/J1kg0ZTSyY
— Johns. (@CricCrazyJohns) May 5, 2024
That turnaround by Rahul! 🔥#PBKSvCSK pic.twitter.com/8zfM8ggQCP
— Punjab Kings (@PunjabKingsIPL) May 5, 2024