iDreamPost
android-app
ios-app

Ravindra Jadeja: మూడో టెస్ట్‌లో పిచ్‌కు ముద్దు పెట్టిన జడేజా! ఎందుకిలా చేశాడంటే..?

  • Published Feb 19, 2024 | 1:37 PM Updated Updated Feb 19, 2024 | 1:37 PM

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పైగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కూడా అతన్నే వరించింది. అయితే.. మ్యాచ్‌ గెలవగానే జడేజా చేసిన పని ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పైగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కూడా అతన్నే వరించింది. అయితే.. మ్యాచ్‌ గెలవగానే జడేజా చేసిన పని ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 19, 2024 | 1:37 PMUpdated Feb 19, 2024 | 1:37 PM
Ravindra Jadeja: మూడో టెస్ట్‌లో పిచ్‌కు ముద్దు పెట్టిన జడేజా! ఎందుకిలా చేశాడంటే..?

ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌లో ఓడిపోయినప్పటికీ.. పుంజుకుని తర్వాత రెండు టెస్టుల్లో విజయం సాధించింది రోహిత్‌ సేన. మూడో టెస్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించారు. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. అలాగే.. తొలి మ్యాచ్‌ ఆడుతున్న యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటాడు. బౌలింగ్‌లో సిరాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లతో చెలరేగాడు. మిగతా బౌలర్లు బుమ్రా, అశ్విన్‌, కుల్దీప్‌ సైతం మంచి ప్రదర్శన కనబర్చారు. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319, రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూల్చారు. అయితే.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మ్యాచ్‌ ముగియగానే పిచ్‌కు ముద్దు పెట్టాడు. ఈ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం జడేజా పిచ్‌కు ముద్దు పెడుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి జడేజా అలా ఎందుకు చేశాడో? దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి.. తానుందుకు వరల్డ్‌ నంబర్‌ వన్‌ టెస్ట్‌ ఆల్‌రౌండరో మరోసారి నిరూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజ్‌లోకి వచ్చిన జడేజా.. కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. నాలుగో వికెట్‌కు ఏకంగా 204 పరుగుల భారీ పార్ట్నర్‌షిప్‌ నెలకొల్పడం వల్లే టీమిండియా మ్యాచ్‌లో నిలబడగలిగింది. జడేజా 225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 112 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ సమయంలో రెండు వికెట్లు పడగొట్టాడు. తిరిగి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 వికెట్ల హాల్‌ సాధించి.. ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. 557 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన బజ్‌బాల్‌ ఇంగ్లండ్‌ బెండూ తీస్తూ.. తన స్పిన్‌ మాయాజాలంతో కేవలం 122 పరుగులకే ఇంగ్లండ్‌ను కుప్పకూల్చాడు.

ఇలా.. మూడో టెస్టులో చిరకాలం గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు జడేజా. బౌలింగ్‌లో ఐదు వికెట్ల హాల్‌ సాధించగానే.. జడేజా ఇలా రాజ్‌కోట్‌ పిచ్‌కు ముందు పెట్టాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఐదు వికెట్ల హాల్‌ సాధించడం ఏ బౌలర్‌కైనా సంతోషాన్ని ఇచ్చే విషయం. పైగా హోం గ్రౌండ్‌లో ఇలాంటి ఫీట్‌ సాధిస్తే.. ఆ ఆనందానికి అవధులు ఉండవ్‌. ఇలాంటి మధుర క్షణాలనే జడేజా మూడో టెస్ట్‌తో అనుభవించాడు. తన హోం గ్రౌండ్స్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల హాల్‌ సాధించడంతో జడేజా సంతోషంలో పిచ్‌కు ముద్దు పెట్టాడు. తన మాతృ భూమికి ముద్దు పెడుతూ.. జడేజా తన కృతజ్ఞతను చాటుకున్నాడు. మరి జడేజా చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.