SNP
RCB vs LSG, IPL 2024: ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్ మంగళవారం జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలనే కసితో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారీ మార్పులతో రానుంది ఆర్సీబీ. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
RCB vs LSG, IPL 2024: ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్ మంగళవారం జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలనే కసితో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారీ మార్పులతో రానుంది ఆర్సీబీ. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్‌లో ఉన్న అన్ని టీమ్స్‌లో కెల్లా అత్యంత భారీ క్రేజ్ ఉన్న టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ, ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కూడా ఆర్సీబీ ఆట తీరు అంత బాగా లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. తర్వాత పంజాబ్‌పై నెగ్గినా.. మళ్లీ వెంటనే కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఇలా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో రెండో ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు సిద్ధం అవుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారీ మార్పులతో ఆర్సీబీ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆర్సీబీ టీమ్‌లో విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ తప్పించి ఎవరూ పెద్దగా ఫామ్లో లేరు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, సిరాజ్ లాంటి కీ ప్లేయర్లు కూడా ఫేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. వారికి తోడు ఎన్నో ఆశలు పెట్టి కొనుగోలు చేసిన కామెరున్ గ్రీన్, అల్జారీ జోసెఫ్‌లు కూడా దారుణంగా నిరాశపరుస్తున్నారు. టీమిండియా యువ క్రికెటర్ రజత్ పాటిదార్ కూడా పూర్ ఫామ్‌ను కంటీన్యూ చేస్తున్నాడు. దీంతో.. ఆర్సీబీ చాలా వీక్ టీమ్‌లా కనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో అయితే.. ఈ ఐపీఎల్ సీజన్లోనే అత్యంత చెత్త టీమ్‌గా ఉందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అందుకే ఆ చెత్తను పక్కనపెట్టి.. లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ బరిలోకి దిగనుంది.
ముఖ్యంగా లక్నోతో మ్యాచ్‌లో అల్జారీ జోసెఫ్, రజత్ పాటిదార్, కామెరున్ గ్రీన్, యశ్ దయాళ్‌ను పక్కనపెట్టి.. వారి స్థానాల్లో లూకీ ఫెర్గుసన్, ప్రభుదేశాయ్, విల్ జాక్స్, ఆకాశ్ దీప్‌లను బరిలోకి దింపనున్నట్లు సమాచారం. ఆర్సీబీ అభిమానులు కూడా వాళ్లను పక్కనపెట్టాలని, ఆ చెత్తను తీసేయాలని చాలా ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ ఛేంజెస్‌తోనైనా.. ఆర్సీబీ తలరాత మారుతుందేమో చూడాలి. అయితే.. విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే ఆధారపడుకుండా.. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ కూడా బ్యాటింగ్‌లో రాణిస్తే మాత్రం.. ఆర్సీబీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
New month ➡️ New records to break ➡️ New goals to achieve#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/uTPeCZEKm9
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 1, 2024