iDreamPost
android-app
ios-app

SRHను దారుణంగా అవమానించిన RCB! నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా?

  • Published Apr 26, 2024 | 9:57 AM Updated Updated Apr 26, 2024 | 9:57 AM

SRH vs RCB, IPL 2024: ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేసిన ఒక పని ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఎస్‌ఆర్‌హెచ్‌ పరువు తీసేలా ఆర్సీబీ ఆ పనిచేసిందని క్రికెట్‌ ‍ఫ్యాన్స్‌ అంటున్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

SRH vs RCB, IPL 2024: ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేసిన ఒక పని ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఎస్‌ఆర్‌హెచ్‌ పరువు తీసేలా ఆర్సీబీ ఆ పనిచేసిందని క్రికెట్‌ ‍ఫ్యాన్స్‌ అంటున్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Apr 26, 2024 | 9:57 AMUpdated Apr 26, 2024 | 9:57 AM
SRHను దారుణంగా అవమానించిన RCB! నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ అనగానే మొన్నటి వరకు ప్రత్యర్థి జట్లు భయపడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ అంత విధ్వంసకరంగా ఉండేది. కానీ, గురువారం ఉప్పల్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం.. ఎస్‌ఆర్‌హెచ్‌ తమ ఆటకు పూర్తి భిన్నంగా ఆడింది. ఈ సీజన్‌లో 266, 277, 287 లాంటి అతి భారీ స్కోర్లు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఆర్సీబీపై 207 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేక ఓటమి పాలైంది. మ్యాచ్‌ ఫలితం పక్కనపెడితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ ఇగోపై దెబ్బ కొట్టింది. ఒక విధంగా చెప్పాలంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా అవమానించింది. అయితే.. అది మ్యాచ్‌ ఓడించి కాదులేండి.. ఇంకో విధంగా. మరి ఎస్‌ఆర్‌హెచ్‌ పరువును ఆర్సీబీ ఏ విధంగా తీసిందో ఇప్పుడు చూద్దాం..

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 207 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు తొలి ఓవర్‌లోనే విల్‌ జాక్స్‌ షాకిచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ విధ్వంసకర ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను అవుట్‌ చేసి సన్‌రైజర్స్‌ పతనాన్ని శాసించాడు. ఆ వెంటనే అశిషేక్‌ శర్మ, ఎడెన్‌ మార్కరమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ కూడా అవుట్‌ కావడంతో.. ఎస్‌ఆర్‌హెచ్‌ తమ ప్రధాన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆ జట్టు హార్డ్‌ హిట్టర్‌ అబ్దుల్‌ సమద్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ సమయంలో ఆర్సీబీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇగోపై కొట్టింది. ఆర్సీబీ చేసిన పనికి ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లే కాదు, స్టేడియంలో ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అయ్యారు.

సమద్‌ క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత.. ఏకంగా టెస్ట్‌ ఫీల్డింగ్‌ని పెట్టాడు ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, ఇందులో కోహ్లీ ప్లాన్‌ కూడా ఉంది. కోహ్లీ స్లిప్‌లో అలాగే, సిల్లీ పాయింట్‌లో కూడా ఒక ఫీల్డర్‌ను పెట్టి.. సమద్‌ను ఒత్తిడిలో పెట్టడంతో పాటు.. ఆర్సీబీపై భారీ స్కోర్‌ చేసి.. రికార్డ్‌ బద్దలు కొడతామనే ఎస్‌ఆర్‌హెచ్‌ ఇగోను దెబ్బతీస్తూ.. టెస్ట్‌ ఫీల్డింగ్‌ పెట్టి ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా అవమానించింది ఆర్సీబీ. ఈ సీన్‌ చూసి.. ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుష్‌ అవుతున్నారు. తమ బౌలింగ్‌ ఎటాక్‌ను తక్కువ చేస్తూ.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేస్తే 300 మార్క్‌ను దాటేస్తామని చాలా మంది ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. వారందరికీ కౌంటర్‌ ఇస్తూ.. ఆర్సీబీ టెస్ట్‌ ఫీల్డింగ్‌ పెట్టింది. మరి ఈ సీజన్‌లో అత్యంత భీకరంగా బ్యాటింగ్‌ చేస్తున్న టీమ్‌కు వ్యతిరేకంగా ఆర్సీబీ టెస్ట్‌ ఫీల్డింగ్‌ను పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by CricFit | Cricket News Update (@cricfit)