iDreamPost
android-app
ios-app

ఆ RCB ఆటగాడు బాగా కాస్ట్‌లీ.. ఒక్కో పరుగు రూ.27 లక్షలు! ఉమ్మేస్తున్న ఫ్యాన్స్‌!

  • Published May 23, 2024 | 1:08 PM Updated Updated May 23, 2024 | 1:16 PM

Glenn Maxwell, RCB vs RR, IPL 2024: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. ఎంతో పోరాటం చేసి ప్లే ఆఫ్స్‌ చేరిన ఆ జట్టు ఎలిమినేటర్‌తో ఇంటికి వెళ్లింది. అయితే.. ఆ టీమ్‌లో ఓ ప్లేయర్‌ ఒక్కో పరుగుకు ఏకంగా 27 లక్షలు తీసుకున్నాడనే విషయం వైరల్‌ అవుతోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Glenn Maxwell, RCB vs RR, IPL 2024: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. ఎంతో పోరాటం చేసి ప్లే ఆఫ్స్‌ చేరిన ఆ జట్టు ఎలిమినేటర్‌తో ఇంటికి వెళ్లింది. అయితే.. ఆ టీమ్‌లో ఓ ప్లేయర్‌ ఒక్కో పరుగుకు ఏకంగా 27 లక్షలు తీసుకున్నాడనే విషయం వైరల్‌ అవుతోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 23, 2024 | 1:08 PMUpdated May 23, 2024 | 1:16 PM
ఆ RCB ఆటగాడు బాగా కాస్ట్‌లీ.. ఒక్కో పరుగు రూ.27 లక్షలు! ఉమ్మేస్తున్న ఫ్యాన్స్‌!

ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. ఐపీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న వారి కల మరో ఏడాదికి పోస్ట్‌ పోన్‌ అయింది. ఈ సీజన్‌లో అనితర సాధ్యమైన ఆటతో ప్లే ఆఫ్స్‌ వరకు దూసుకొచ్చిన ఆర్సీబీ.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓటమి పాలై.. ఇంటి బాట పట్టింది. తొలి 8 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో ప్లే ఆఫ్స్‌ చేరే ఛాన్స్‌ను 1 పర్సెంట్‌ చేసుకున్న ఆర్సీబీ.. ఆ 1 పర్సెంట్‌ను 100 పర్సెంట్‌ చేసి.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. కానీ, వారి పోరాటం ఎలిమినేటర్‌తోనే ముగిసింది. అయితే.. ఆర్సీబీ ఓడిపోయిన బాధను ఆ జట్టు అభిమానులు ఓ ఆటగాడిపై చూపిస్తున్నారు. ఆ ప్లేయర్‌ ఎవరంటే.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. ఆర్సీబీలో స్టార్‌ ప్లేయర్‌గా ఉన్న మ్యాక్సీ ఈ సీజన్‌లో దారుణంగా విఫలం అయ్యాడు. 2021 నుంచి ఆర్సీబీలో ఉన్న మ్యాక్స్‌వెల్‌.. ప్రతి వరుసగా మూడు సీజన్లలో మంచి ప్రదర్శన కనబర్చాడు.

కానీ, ఏమైందో ఏమో కానీ, ఈ సీజన్‌లో మాత్రం అత్యంత దారుణంగా ఫెయిల్‌ అయ్యాడు. 2021 సీజన్‌లో 513 పరుగులు, 2022లో 301, 2023లో 400 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ ఈ సీజన్‌లో మాత్రం ఘోరంగా కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాక్స్‌వెల్‌ నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనను ఆర్సీబీ అభిమానులు అస్సలు ఊహించలేదు. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 5.78 యావరేజ్‌తో కేవలం 52 పరుగులు చేశాడు. అందులో ఒక్కటంటే ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు. మ్యాక్స్‌వెల్‌ ఇంత దారుణంగా విఫలం అవ్వడంపై ఆర్సీబీ అభిమానులు అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా అతని ధరకి, అతను చేసిన పరుగులకు ముడిపెడుతూ.. దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

ఐపీఎల్‌ 2021 సీజన్‌ కంటే ముందు మ్యాక్స్‌వెల్‌ పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడేవాడు. ఐపీఎల్‌ 2020లో పంజాబ్‌ అతన్ని రిలీజ్‌ చేసింది. ఐపీఎల్‌ 2021 వేలంలో మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ ఏకంగా రూ.14.25 కోట్ల అత్యంత భారీ ధరపెట్టి కొనుగోలు చేసింది. గత నాలుగేళ్లుగా మ్యాక్స్‌వెల్‌కు అదే మొత్తాన్ని చెల్లిస్తోంది. అయితే.. ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ చేసిన పరుగులు కేవలం 52. ఈ 52 పరుగుల కోసం అతనికి 14.25 కోట్లు చెల్లించాలి. అంటే ఒక్కో పరుగుకు లెక్కిస్తే.. రూ.27 లక్షల పై మాటే. ఒక్కో పరుగుకు ఇంత మొత్తం తీసుకునే కాస్ట్‌లీ ప్లేయర్‌ అంటూ మ్యాక్స్‌వెల్‌ను ట్రోల్‌ చేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్‌. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.