SNP
RCB vs SRH, IPL 2024: ఐపీఎల్ 2024లో ఎట్టకేలకు ఆర్సీబీకి రెండో విజయం దక్కింది. అయితే.. ఆర్సీబీలో ఇన్ని రోజులు ఏం మిస్ అవుతుందో.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌తో బయటపడింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం..
RCB vs SRH, IPL 2024: ఐపీఎల్ 2024లో ఎట్టకేలకు ఆర్సీబీకి రెండో విజయం దక్కింది. అయితే.. ఆర్సీబీలో ఇన్ని రోజులు ఏం మిస్ అవుతుందో.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌తో బయటపడింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్, అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో రెండో గెలుపు వచ్చి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 7 పరాజయాలు చవిచూసింది. తొలుత తమ రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించిన ఆర్సబీ.. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత.. పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో రెండో గెలుపును సొంతం చేసుకుంది. అయితే.. ఆర్సీబీలో ఇన్ని రోజులుగా ఇదే మిస్ అయిందని, ఈ మ్యాచ్‌లో చూపించిన కసితో పాటు బౌలింగ్ యూనిట్‌లో వచ్చిన మార్పులు.. ఆర్సీబీలో ఆరంభంలోనే వచ్చి ఉంటే.. ప్రస్తుతం టీమ్ పరిస్థితి ఇలా ఉండేది కాదని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
ఈ సీజన్‌లో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ దారుణంగా విఫలం అయ్యింది. ఆర్సీబీ బ్యాటర్లు భారీ స్కోర్లు చేసినా.. బౌలర్లు వాటిని డిఫెండ్ చేయలేకపోయారు. అలాగే ఫస్ట్ బౌలింగ్ చేస్తే.. 287 లాంటి భారీ స్కోర్లు ప్రత్యర్టికి కట్టబెట్టారు. ఇలా ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఉన్న ప్రధాన లోపం బౌలింగ్‌గా స్పష్టంగా కనిపించింది. జట్టులో ఉన్న బౌలర్లందరినీ కూడా ఆర్సీబీ ప్రయోగించింది. ఫారెన్ బౌలర్లు.. అల్జారీ జోసెఫ్, టోప్లీ, లూకీ ఫెర్గుసన్ ఇలా అంతా విఫలం అయ్యారు. ఆర్సీబీ ప్రధాన బౌలర్.. మొహమ్మద్ సిరాజ్.. వైఫల్యం ఆర్సీబీ బౌలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడు సిరాజ్ ఫామ్‌లోకి వచ్చినా.. చాలా ఆలస్యమైపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సిరాజ్ వికెట్లు తీయకపోయినా.. చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఇక ఆర్సీబీకి బౌలింగ్‌లో ఒక నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం చాలా పెద్ద దెబ్బగా మారింది. గతంలో యుజ్వేంద్ర చాహల్ రూపంలో ఆర్సీబీలో క్వాలిటీ స్పిన్నర్ ఉండేవాడు. అతను వెళ్లిపోయిన తర్వాత వనిందు హసరంగాను తీసుకొచ్చినా.. అతను పెద్దగా రాణించలేదు. అయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో విల్ జాక్స్, కరణ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారికి స్వప్నిల్ సింగ్ కూడా తోడు అయ్యాడు. అయితే.. విల్ జాక్స్, కరణ్ శర్మను ఆరంభం మ్యాచ్‌ల్లో పక్కనపెట్టడం ఆర్సీబీకి దెబ్బతీసింది. ఆర్సీబీకి బ్యాటింగ్‌లో పెద్దగా ప్రాబ్లమ్ లేకపోయినా బౌలింగ్‌తోనే ప్రధాన సమస్య. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌పై చూపించిన కమిట్‌మెంట్, కసిని స్టార్టింగ్‌లో చూపించి ఉంటే.. ఇప్పుడు ఆర్సీబీ మెరుగైన స్థితిలో ప్లే ఆఫ్ రేసులో ముందు నిలిచేదని క్రికెట్ అభిమానులు సైతం అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An excellent night for RCB spinners 🔥#KarnSharma #SwapnilSingh #WillJacks #IPL2024 #Cricket #SRHvsRCB pic.twitter.com/hycCjJbhMw
— Wisden India (@WisdenIndia) April 25, 2024