iDreamPost
android-app
ios-app

RCB, Prabhas: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు RCB జెర్సీ అందజేత! ఎందుకంటే..?

  • Published Jan 16, 2024 | 4:18 PM Updated Updated Jan 16, 2024 | 4:18 PM

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌.. ప్రస్తుతం సలార్‌ సక్సెస్‌ను ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే.. సలార్‌ సక్సెస్‌లో ఉన్న ప్రభాస్‌కు ఆర్సీబీ జెర్సీ గిఫ్ట్‌గా అందింది. ప్రభాస్‌కు ఆర్సీబీకి జెర్సీకి లింక్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌.. ప్రస్తుతం సలార్‌ సక్సెస్‌ను ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే.. సలార్‌ సక్సెస్‌లో ఉన్న ప్రభాస్‌కు ఆర్సీబీ జెర్సీ గిఫ్ట్‌గా అందింది. ప్రభాస్‌కు ఆర్సీబీకి జెర్సీకి లింక్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 16, 2024 | 4:18 PMUpdated Jan 16, 2024 | 4:18 PM
RCB, Prabhas: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు RCB జెర్సీ అందజేత! ఎందుకంటే..?

రెబల్ స్టార్‌ ప్రభాస్‌ కు చాలా కాలం తర్వాత సలార్‌ తో ఒక సాలిడ్‌ హిట్‌ పడింది. ఈ సినిమా దాదాపు 800 కోట్లపైనే కలెక్ట్‌ చేసి.. ప్రభాస్‌ స్టామినా ఏంటో మరోసారి చాటిచెప్పింది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్‌ అయిన సలార్‌ అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్‌ గా నిలిచింది. ప్రశాంత్‌ నీల్‌ సినిమాటిక్‌ ఎలివేషన్స్‌, ప్రభాస్‌ స్క్రీన్ ప్రెజెన్స్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రికార్డు స్థాయి కలెక్షన్స్‌ తో బాక్సాఫీస్‌ బద్దలైంది. అలాంటి సాలిడ్‌ హిట్‌ అందుకున్న ప్రభాస్‌ తాజాగా బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక ప్రత్యేకమైన బహుమతి అందింది. అదేంటంటే.. ఆర్సీబీ టీమ్‌ జెర్సీ.

ఇండియాలో సినిమా-క్రికెట్‌.. ఈ రెండిటికీ ఎంత క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటినీ మతాలుగా భావించే వాళ్లు ఉన్నారు. అంతలా ఇండియన్స్‌ నరనరాల్లో సినిమా, క్రికెట్‌ పాకిపోయింది. అయితే.. ఈ రెండు రంగాల కలయిలో ఈ చిన్న సంఘటన జరిగినా అది హెడ్‌లైన్స్‌లో నిలవాల్సిందే. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఆర్సీబీ జెర్సీని గిఫ్ట్‌ గా అందుకున్నాడు. ఐపీఎల్‌ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ కు ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ కప్పుకొట్టకపోయినా.. ఫ్యాన్‌ బేస్‌, పాపులారిటీ విషయంలో ఆర్సీబీ నంబర్‌ వన్‌ టీమ్‌ గా ఉంది.

అందుకు కారణం.. విరాట్‌ కోహ్లీ. ఆర్సీబీలో కోహ్లీ ఉండటంతోనే ఆ జట్టుకు అంత క్రేజ్‌. చాలా మంది మన హోం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ను కూడా కాదని ఆర్సీబీని సపోర్ట్‌ చేస్తుంటారు. అందుకు కారణం కోహ్లీనే. అతనిపై ఉన్న అభిమానం.. ఆర్సీబీపై చూపిస్తుంటారు. అలాంటి క్రేజ్‌ ఉన్న టీమ్‌ జెర్సీని ఇప్పుడు ప్రభాస్‌ అందుకోవడం హైలెట్‌ గా మారింది. ప్రభాస్‌ తన సలార్‌ టీమ్‌ తో కలిసి బెంగళూరులో పర్యటించాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రభాస్‌ కు ఆర్సీబీ జెర్సీని బహుకరించింది. ఆ జెర్సీని ప్రభాస్‌ ఎంతో సంతోషంగా అందుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. మరి ప్రభాస్‌ ఆర్సీబీ జెర్సీ అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetgray girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio