iDreamPost
android-app
ios-app

17 ఏళ్ల చరిత్రలో ఘోర తప్పిదం! బయటపడ్డ సంచలన నిజాలు

  • Published Apr 22, 2024 | 12:45 PM Updated Updated Apr 22, 2024 | 12:45 PM

Suyash Prabhudessai, RCB vs KKR: ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌లో లీగ్‌ చరిత్రలోనే ఘోర తప్పిదం చోటు చేసుకుంది. ఈ తప్పు కారణంగా పాపం ఆర్సీబీ బలైంది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

Suyash Prabhudessai, RCB vs KKR: ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌లో లీగ్‌ చరిత్రలోనే ఘోర తప్పిదం చోటు చేసుకుంది. ఈ తప్పు కారణంగా పాపం ఆర్సీబీ బలైంది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

  • Published Apr 22, 2024 | 12:45 PMUpdated Apr 22, 2024 | 12:45 PM
17 ఏళ్ల చరిత్రలో ఘోర తప్పిదం! బయటపడ్డ సంచలన నిజాలు

IPL 2024లో భాగంగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ మ్యాచ్‌లో చివరి బాల్‌కి వచ్చిన థ్రిల్లింగ్‌ విక్టరీ, విరాట్‌ కోహ్లీ అవుట్‌ వివాదాన్ని మించి మరో భారీ వివాదం రాజుకుంది. ఈ మ్యాచ్‌లో అంపైర్లు చేసిన తప్పిదంపై ప్రస్తుతం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం భగ్గుమంటోంది. ఐపీఎల్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘోర తప్పిదం చోటు చేసుకుంది. అయితే.. ఈ తప్పిదానికి బలైంది మాత్రం ఆర్సీబీనే. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ప్రాణం పెట్టి ఆడిన ఆర్సీబీ.. విజయానికి ఒక్క అడుగుదూరంలో నిలిచిపోయింది.

ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో చివరి బాల్‌కు మూడు పరుగులు అవసరమైన సమయంలో ఒక్క పరుగు మాత్రమే చేసి.. ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా బయటపడ్డ సంలచన నిజాలతో అంపైర్లు చేసిన తప్పు కారణంగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు పరుగులను కోల్పోవాల్సి వచ్చింది. న్యాయంగా ఆర్సీబీకి రావాల్సిన ఆ రెండు రన్స్‌ కనుక ఆర్సీబీ స్కోర్‌ బోర్డులో చేరి ఉంటే.. ఈ మ్యాచ్‌ను ఆర్సీబీ గెలిచి ఉండేది.. ఈ సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచేది. కానీ, అంపైర్లు చేసిన ఘోర తప్పిదంతో అటు ఆర్సీబీ ఓడిపోవడంతో పాటు.. ఐపీఎల్‌పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలింతకీ ఏం జరిగిందంటే..

కేకేఆర్‌ నిర్దేశించిన 223 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసే క్రమంలో.. కేకేఆర్‌ బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ ఐదో బంతికి ఆర్సీబీ బ్యాటర్‌ ప్రభుదేశాయ్‌ షార్ట్‌ ఫైన్‌ లెగ్‌ మీదుగా మంచి షాట్‌ ఆడాడు. అది ఫోర్‌గా వెళ్లిందని అంపైర్లు నిర్దారించారు. కానీ, నిజానికి అది సిక్స్‌. అసలు ఏం మాత్రం కన్ఫమేషన్‌ లేకుండా, దాన్ని చెక్‌ చేయకుండా ఫోర్‌గా ప్రకటించారు. అక్కడ ఆర్సీబీ రెండు పరుగులు కోల్పోయింది. చివర్లో మ్యాచ్‌ను ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. ఆ రెండు రన్స్‌ ఆర్సీబీ స్కోర్‌కు యాడ్‌ అయి ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఉండేది. సాధారణ అంపైరింగ్‌తో ఆర్సీబీకి నష్టం చేయడమే కాకుండా.. ఐపీఎల్‌కు బ్యాడ్‌ నేమ్‌ తెచ్చేలా అంపైరింగ్‌ జరుగుతోందని క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం ‍వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్నేషనల్‌ అంపైర్‌ రిచర్డ్‌ కాటిల్‌బర్డ్‌ సైతం స్పందిస్తూ.. తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.