iDreamPost
android-app
ios-app

Ambati Rayudu: కోహ్లీపై విమర్శలు.. రాయుడు భార్య, పిల్లలకు బెదిరింపులు!

  • Published May 30, 2024 | 7:37 AM Updated Updated May 30, 2024 | 12:43 PM

కోహ్లీని విమర్శిస్తున్నందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ రాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీకాక అతడి భార్య, పిల్లలకు హాని కలిగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

కోహ్లీని విమర్శిస్తున్నందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ రాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీకాక అతడి భార్య, పిల్లలకు హాని కలిగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Ambati Rayudu: కోహ్లీపై విమర్శలు.. రాయుడు భార్య, పిల్లలకు బెదిరింపులు!

అంబటి రాయుడు.. గత కొన్ని రోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు టీమ్ పై కొన్ని రోజులుగా రాయుడు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ పై ఎప్పుడైతే ఆర్సీబీ గెలిచిందో.. అప్పటి నుంచి తన నోటికి పనిచెప్పాడు ఈ టీమిండియా మాజీ క్రికెటర్. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రానా ఐపీఎల్ టైటిల్ గెలవలేరు అంటూ డైరెక్ట్ గా విరాట్ ను టార్గెట్ చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని విమర్శిస్తున్నందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ రాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీకాక అతడి భార్య, పిల్లలకు హాని కలిగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీని టార్గెట్ గా చేసుకుని ఆర్సీబీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రానా.. ఐపీఎల్ కప్ గెలవలేరు అని డైరెక్ట్ గా కోహ్లీని విమర్శించాడు రాయుడు. ఈ కామెంట్స్ ను జీర్ణించుకోలేకపోతున్నారు ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్. తమ అభిమాన క్రికెటర్ నే అవమానిస్తావా అంటూ.. రాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అతడి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని రాయుడు ఫ్రెండ్ చెప్పిన సంచలన నిజాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

రాయుడు స్నేహితుడు సామ్ పాల్ మాట్లాడుతూ..”కోహ్లీపై రాయుడు చేసిన వ్యాఖ్యలకు గాను.. కొంత మంది ఆర్సీబీ ఫ్యాన్స్ రెచ్చిపోయి, అతడి కుటుంబంపై దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాయుడు భార్య, పిల్లలపై లైంగిక దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతి వ్యక్తికి రాజ్యంగం కొన్ని హక్కులు కల్పిస్తుంది. వాటిని కొంత మందికాలరాస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు, న్యాయవ్యవస్థ కలగజేసుకుని వారిని కఠినంగా శిక్షించాలి” అని చెప్పుకొచ్చాడు. క్రికెట్ లో విమర్శలు అన్నవి సాధారణ విషయమే.. అంత మాత్రాన ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేసి.. బెదిరించడం కరెక్ట్ కాదని కొంత మంది రాయుడికి  అండగా నిలుస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.