iDreamPost
android-app
ios-app

తొలి మ్యాచ్‌ ఆడుతూ.. SRH కొంపముంచాడు! ఎవరీ 33 ఏళ్ల స్వప్నిల్‌?

  • Published Apr 26, 2024 | 10:47 AM Updated Updated Apr 26, 2024 | 10:47 AM

Swapnil Singh, RCB vs SRH: 33 ఏళ్ల ఓ క్రికెటర్‌ ఆర్సీబీ తరఫున తొలి మ్యాచ్‌ ఆడుతూ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొంపముంచాడు. దీంతో ఎవరీ స్వప్నిల్‌ సింగ్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Swapnil Singh, RCB vs SRH: 33 ఏళ్ల ఓ క్రికెటర్‌ ఆర్సీబీ తరఫున తొలి మ్యాచ్‌ ఆడుతూ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొంపముంచాడు. దీంతో ఎవరీ స్వప్నిల్‌ సింగ్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 26, 2024 | 10:47 AMUpdated Apr 26, 2024 | 10:47 AM
తొలి మ్యాచ్‌ ఆడుతూ.. SRH కొంపముంచాడు! ఎవరీ 33 ఏళ్ల స్వప్నిల్‌?

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ అనూహ్యంగా ఓటమి పాలైంది. గురువారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 207 పరుగుల టార్గెట్‌ను సన్‌రైజర్స్‌ ఊదిపారేస్తుంది అనుకున్న ఫ్యాన్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ.. కేవలం 171 పరుగులకే పరిమితం అయింది. జట్టులోని టాప్‌ 4 బ్యాటర్లు తక్కువ స్కోర్లకే అవుట్‌ అవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ క్రికెటర్‌.. సన్‌రైజర్స్‌ కొంపముంచాడు. ఆర్సీబీ తరఫున తొలి మ్యాచ్‌ ఆడుతున్న.. స్విప్నిల్‌ సింగ్‌ అనే 33 ఏళ్ల క్రికెటర్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాడు. అసలు ఎవరీ స్విప్నిల్‌ సింగ్‌? అతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్విప్నిల్‌ సింగ్‌, 33 ఏళ్ల ఈ క్రికెటర్‌.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌ బరేలికి చెందిన ఆటగాడు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఐపీఎల్‌లో ఉన్నాడు. 2008లో ఇతను కుర్రాడిగా ఉన్న సమయంలో ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కానీ, ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడే అవకాశం రాలేదు. కానీ, 2016-2017 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున తొలి సారి ఐపీఎల్‌ బరిలోకి దిగాడు. 17 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఉన్నా కూడా కేవలం 8 మ్యాచ్‌లు ఆడే అవకాశం మాత్రమే వచ్చింది. 2023 సీజన్‌లో ఇతను లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌లో ఉన్నాడు. తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే బరోడా టీమ్‌ తరఫున ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళి క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండటంతో 2024లో ఆర్సీబీలోకి వచ్చాడు. దీంతో.. గురువారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అతనికి తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. ఆర్సీబీ తరఫున తొలి మ్యాచ్‌ ఆడే అవకాశాన్ని స్వదినియోగం చేసుకున్న స్విప్నిల్‌ సింగ్‌.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తన మార్క్‌ చూపించాడు.

బ్యాటింగ్‌లో 6 బంతుల్లో 12 రన్స్‌ చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో 6, 4 కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక బౌలింగ్‌లో స్విప్నిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీజన్‌లోనే దుర్బేధ్యమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ ముందు పవర్‌ ప్లేలో బౌలింగ్‌ చేసేందుకు వచ్చాడు స్విప్నిల్‌.. తొలి ఓవర్‌లనే ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ, అంతకు మించి.. రెండు కీలక వికెట్లు తీశాడు. ఆ ఓవర్‌ రెండో బంతికి ఎడెన్‌ మార్కరమ్‌ను ఫుల్‌టాస్‌ బాల్‌తో ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేసిన స్విప్నిల్‌.. ఆ ఓవర్‌ చివరి బంతికి డేంజరస్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ను బోల్తా కొట్టించాడు. ఒకే ఓవర్‌లో మార్కరమ్‌, క్లాసెన్‌ను అవుట్‌ చేసి.. ఎస్‌ఆర్‌హెచ్‌ కొంపముంచాడు. ఈ ఓవర్‌ తర్వాత ఏ దశలో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ కోలుకోలేదు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన స్వప్నిల్‌ 40 పరుగులు సమర్పించుకున్నా.. 2 కీలక వికెట్లు తీసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఆర్సీబీ తరఫున ఫస్ట్‌ మ్యాచ్‌ ఆడుతూ.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కారణంగా నిలిచిన ఈ స్వప్నిల్‌ సింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.