పత్తి చేన్లో జడేజాతో ఉన్న దిగ్గజ క్రికెటర్‌ను గుర్తుపట్టారా?

Ravindra Jadeja, MS Dhoni: బంగ్లాదేశ్​ సిరీస్​కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య రవీబాతో కలసి టూర్లకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీమిండియా దిగ్గజాన్ని అతడు కలిశాడు.

Ravindra Jadeja, MS Dhoni: బంగ్లాదేశ్​ సిరీస్​కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య రవీబాతో కలసి టూర్లకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీమిండియా దిగ్గజాన్ని అతడు కలిశాడు.

బంగ్లాదేశ్​ సిరీస్​కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య రవీబాతో కలసి వెకేషన్స్​కు వెళ్తున్నాడు. ఇప్పటికే పలు నగరాలు చుట్టొచ్చిన జడేజా.. తాజాగా మరో ప్లేస్​కు వెళ్లాడు. అయితే ఈసారి వెళ్లిన ప్రదేశం కంటే కలసిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అక్కడ ఉన్న టీమిండియా లెజెండ్​ను కలిశాడు జడ్డూ. పత్తి చేన్లలో అతడితో కలసి ఫొటోలు దిగాడు. పత్తి చేను మొత్తం కలియదిరిగాడు. ఇంతకీ జడేజా కలసిన ఆ దిగ్గజం ఎవరు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశాడు జడేజా. పత్తి చేనులో జడ్డూ-ధోని కలసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో చేనును గమనిస్తూ ధోని కనిపించాడు. అతడితో సెల్ఫీ తీసుకుంటూ కెమెరాకు పోజు ఇచ్చాడు జడ్డూ. ఇది రాంచీలోని మాహీ ఫామ్​హౌజ్​లో తీసిన ఫొటో అని తెలుస్తోంది. వీటిని చూసిన నెటిజన్స్.. సీఎస్​కే సూపర్ జోడీ అదిరిపోయిందని అంటున్నారు. వీళ్లను మళ్లీ గ్రౌండ్​లో చెన్నై తరఫున ఆడితే చూడాలని ఉందని చెబుతున్నారు ఇక, ధోని మల్టీ టాలెంటెడ్ అనేది తెలిసిందే. గ్రౌండ్​లోకి దిగితే బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీతో ఆకట్టుకునే ధోనీలో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బైక్​లను విపరీతంగా ఇష్టపడే అతడు.. తన బైక్స్​ను తానే బాగు చేసుకుంటాడు.

ఓ ఫామ్​ హౌజ్ పెట్టి అందులో పంటల సాగు కూడా చేస్తున్నాడు ధోని. వీలున్నప్పుడల్లా అక్కడే సమయం గడుపుతాడు. ఇదే క్రమంలో తనను చూసేందుకు వచ్చిన జడేజాతో పత్తి చేనులో ఫొటో దిగినట్లు తెలిసింది. కాగా, వచ్చే ఏడాది ఐపీఎల్​లో మాహీ ఆడతాడా? లేదా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అతడ్ని సీఎస్​కే ఎలా రీటెయిన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ధోనీని తక్కువ మొత్తానికి టీమ్​లోకి తీసుకొస్తారని వినిపిస్తోంది. కొన్నేళ్ల కింద నిలిపివేసిన అన్​క్యాప్డ్ ప్లేయర్ రూల్​ను మాహీ కోసం బీసీసీఐ మళ్లీ తీసుకొస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్-2025 మెగా ఆక్షన్​కు ఇంకా చాలా సమయం ఉన్నందున ఇప్పుడే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే ఫిట్​గా ఉన్న ధోని లీగ్​లో ఆడటం పక్కా అని అభిమానులు చెబుతున్నారు. నెక్స్ట్ సీజనే కాదు.. ఇంకొన్ని సీజన్లు ఈ లెజెండ్​ క్యాష్ రిచ్ లీగ్​లో కంటిన్యూ అవుతాడని అంటున్నారు.

Show comments