iDreamPost
android-app
ios-app

వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌తో మెస్మరైజ్‌ చేసిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌!

  • Published Jul 28, 2023 | 10:05 AM Updated Updated Jul 28, 2023 | 10:05 AM
  • Published Jul 28, 2023 | 10:05 AMUpdated Jul 28, 2023 | 10:05 AM
వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌తో మెస్మరైజ్‌ చేసిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌!

టీమిండియాకు మహేంద్రసింగ్‌ ధోని కెప్టెన్‌ అయిన తర్వాత ఫీల్డింగ్‌ ఎంతో మెరుగైంది. అంతకు ముందు బెస్ట్‌ ఫీల్డర్లు అంటే యువరాజ్‌ సింగ్‌, మొహహ్మద్‌ కైఫ్‌ పేర్లు మాత్రమే వినపడేవి. కానీ, ఆటగాళ్ల బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎంత ముఖ్యమో.. అలాగే ఫిట్‌నెస్‌ కూడా అంతే ఇంపార్టెంట్‌ అని ధోని ఆటగాళ్లను ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టేలా చేశాడు. అలా చేయని హేమాహేమీ ఆటగాళ్లను కూడా జట్టు నుంచి తప్పించాడు. దాంతో అప్పుడప్పుడే జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టిపెట్టారు. దాంతో టీమిండియా ఫీల్డింగ్‌ స్టాండెట్స్‌ ఎంతో మెరగయ్యాయి. దాన్నే కెప్టెన్‌ అయిన తర్వాత కోహ్లీ కూడా కొనసాగించాడు.

ప్రస్తుతం టీమిండియా ఫీల్డింగ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది. విరాట్‌ కోహ్లీ, జడేజా, గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రోహిత్‌, సిరాజ్‌ ఇలా దాదాపు అందరూ ఫీల్డింగ్‌ బాగా చేస్తారు. ముఖ్యంగా కోహ్లీ, జడేజా అయితే సూపర్‌ ఫీల్డర్స్‌. వీళ్లను దాటి బంతి వెళ్లడం అంటే అదో అద్భుతమనే చెప్పాలి. ఎన్నో సూపర్‌ క్యాచ్‌లు, అద్భుతమైన ఫీల్డింగ్‌తో టీమ్‌కు అదనపు బలంగా మారారు. వీరిని చూసి యంగ్‌ క్రికెటర్లు ఎంతో మంది స్ఫూర్తి పొందుతున్నారు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా.. గురువారం జరిగిన తొలి వన్డేలు ఇద్దరు చెరో అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నారు.

ముఖ్యంగా జడేజా పట్టిన క్యాచ్‌ గురించి మాట్లాడుకోవాలి. యువ క్రికెటర్‌ ముఖేష్‌ కుమార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ 5వ బంతిని విండీస్‌ యువ క్రికెటర్‌ అలిక్ అథనాజ్ పాయింట్‌ దిశగా మంచి షాట్‌ ఆడాడు. బంతి బుల్లెట్‌లా దూసుకెళ్లింది. తన పైనుంచి వెళ్తున్న బంతి అమాంతం గాల్లోకి అంతెత్తున ఎగిరి ఒడిసిపట్టుకున్నాడు జడేజా. దాంతో వెస్టిండీస్‌ బ్యాటర్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లు సైతం షాక్‌ అయ్యారు. జడేజా అంటే మినిమమ్‌ ఉంటుంది అన్నట్లు ఆ క్యాచ్‌ ఉంది. ఆ క్యాచ్‌తో 22 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్న అలిక్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక్కడి నుంచి వెస్టిండీస్‌ ఆలౌట్‌ అయ్యేందుకు పెద్దగా సమయం పట్టలేదు. మరి ఈ మ్యాచ్‌లో జడేజా అందుకున్న ఫైయింగ్‌ క్యాచ్‌ కిందున్న వీడియోలో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: ఇలాంటి క్యాచ్‌లు కోహ్లీకే సాధ్యం.. సింగిల్‌ హ్యాండ్‌ గణేష్‌!