iDreamPost
android-app
ios-app

అమెరికా వీధుల్లో జడేజా సూపర్ డాన్స్.. వీడియో వైరల్!

  • Author Soma Sekhar Published - 10:06 PM, Mon - 7 August 23
  • Author Soma Sekhar Published - 10:06 PM, Mon - 7 August 23
అమెరికా వీధుల్లో జడేజా సూపర్ డాన్స్.. వీడియో వైరల్!

సాధారణంగా క్రికెటర్లకు తీరిక సమయం ఉండదు. బిజీ షెడ్యూల్స్ కారణంగా ఫ్యామిలీలకు టైమ్ కేటాయించడం కుదరదు. టోర్నీలకు మధ్య గ్యాప్ వచ్చినప్పుడో లేదా మేనేజ్ మెంట్ విశ్రాంతి కల్పించినప్పుడో వారికి టైమ్ లభిస్తుంది. ఆ కాస్త టైమ్ ను ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ తర్వాత అతడికి విశ్రాంతిని ఇచ్చింది. దీంతో అతడు ఫ్యామిలీతో యూఎస్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వెకేషన్ లో స్ట్రీట్ లో డ్యాన్స్ ఇరగదీశాడు జడ్డూ.

రవీంద్ర జడేజా.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ గా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపిన జడేజా.. ప్రస్తుతం వెకేషన్ మూడ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. సీనియర్లకు విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో జడ్డూ భాయ్ కు కూడా విశ్రాంతిని ఇచ్చింది మేనేజ్ మెంట్. ఇక ఈ టైమ్ ను ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేస్తున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.

ప్రస్తుతం యూఎస్ వెకేషన్ లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు జడ్డూ. యూఎస్ వీధుల్లో స్ట్రీట్ డ్యాన్స్ చేస్తూ.. చిల్ అవుతున్నాడు జడేజా. ‘ముక్కాల.. ముకాబులా ఓ లైలా’ పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు రవీంద్ర జడేజా. గ్రౌండ్ లో చలాకీగా అప్పుడప్పుడు డ్యాన్స్ వేసే జడ్డూ.. ఇలా అమెరికా వీధుల వెంట డ్యాన్స్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక జడ్డూ డ్యాన్స్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మరి రవీంద్ర జడేజా స్ట్రీట్ డ్యాన్స్ ఎలా ఉందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)


ఇదికూడా చదవండి: హార్దిక్ కెప్టెన్సీ దారుణం.. ఒక్కరికి కూడా గెలవాలన్న కసి లేదు: వెంకటేశ్ ప్రసాద్

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş