iDreamPost
android-app
ios-app

చరిత్రకు అడుగు దూరంలో జడేజా.. ఊరిస్తున్న రెండు క్రేజీ రికార్డులు!

  • Published Sep 17, 2024 | 6:39 PM Updated Updated Sep 17, 2024 | 6:39 PM

Ravindra Jadeja, IND vs BAN: టీమిండియా సీనియర్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు. సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో మైల్​స్టోన్స్ అందుకున్న జడ్డూ.. ఇప్పుడు మరో రెండు క్రేజీ రికార్డ్స్​ను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.

Ravindra Jadeja, IND vs BAN: టీమిండియా సీనియర్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు. సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో మైల్​స్టోన్స్ అందుకున్న జడ్డూ.. ఇప్పుడు మరో రెండు క్రేజీ రికార్డ్స్​ను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.

  • Published Sep 17, 2024 | 6:39 PMUpdated Sep 17, 2024 | 6:39 PM
చరిత్రకు అడుగు దూరంలో జడేజా.. ఊరిస్తున్న రెండు క్రేజీ రికార్డులు!

క్రికెట్​కు టీమిండియా అందించిన బెస్ట్ స్పిన్ ఆల్​రౌండర్స్​లో ఒకడిగా రవీంద్ర జడేజాను చెప్పొచ్చు. టీ20లు, టెస్టులు, వన్డేలు.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ నిఖార్సయిన స్పిన్ బౌలింగ్, పించ్ హిట్టింగ్, మెరుపు ఫీల్డింగ్​తో తోపు ప్లేయర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు జడ్డూ. ముఖ్యంగా టెస్టుల్లో దిగ్గజ క్రికెటర్స్​ సరసన చేరే దిశగా అతడు వడివడిగా పరుగులు పెడుతున్నాడు. లాంగ్ ఫార్మాట్​లో నంబర్ వన్ ఆల్​రౌండర్​గా కొనసాగుతున్న జడ్డూ.. సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో మైల్​స్టోన్స్ అందుకున్నాడు. ఇప్పుడు మరో రెండు క్రేజీ రికార్డ్స్​ను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. బంగ్లాదేశ్​తో గురువారం నుంచి జరిగే తొలి టెస్టులోనే రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నాడు. జడ్డూను ఊరిస్తున్న ఆ రికార్డులు ఏంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు జడేజా. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మరో 6 వికెట్లు పడగొడితే టెస్టుల్లో 300 వికెట్ల మైల్​స్టోన్​ను అందుకుంటాడు. దీంతో టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్​గా అతడు రికార్డుల్లోకి ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ క్లబ్​లో లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619 వికెట్లు)తో పాటు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (516), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) ఉన్నారు. మరో ఆరు వికెట్లు తీస్తే జడ్డూ కూడా ఈ అరుదైన క్లబ్​లోకి అడుగుపెడతాడు. ఆరు వికెట్లు పడగొడితే అతడు మరో రికార్డును కూడా అందుకోనున్నాడు. టెస్టుల్లో 3 వేల పరుగులు చేయడంతో పాటు 300 వికెట్లు తీసిన మూడో భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటికే ఈ లిస్ట్​లో దిగ్గజం కపిల్ దేవ్ (5248 పరుగులు), అశ్విన్ (3309 పరుగులు) ఉన్నారు.

బంగ్లాతో జరిగే తొలి టెస్ట్ జడ్డూకు ఎంతో స్పెషల్​గా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు రికార్డులు ఈ మ్యాచ్​తో అందుకుంటే భలేగా ఉంటుందని అభిమానులు అంటున్నారు. ఇక, జడ్డూ ఇప్పటివరకు 72 టెస్టుల్లో 3036 పరుగులు, 294 వికెట్లు సాధించాడు. చెపాక్ పిచ్​ స్పిన్​కు స్వర్గధామంగా చెబుతారు కాబట్టి తుదిజట్టులో ఈ ఆల్​రౌండర్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అతడు బరిలోకి దిగితే మాత్రం ఆ రెండు క్రేజీ రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అనే చెప్పాలి. రికార్డులు అఛీవ్ చేశాక జడ్డూ మరింత చెలరేగి ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్​లో జోరుగా సాధన చేస్తున్న ఈ లెఫ్టార్మ్ ఆల్​రౌండర్.. బౌలింగ్, బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. బంగ్లాను చిత్తుగా ఓడించాలనే కసితో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. మరి.. తొలి టెస్టులో జడ్డూ చరిత్ర సృష్టిస్తాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.