iDreamPost
android-app
ios-app

Ravindra Jadeja: సూపర్‌ సెంచరీ.. గాయం నుంచి కోలుకుని గర్జించిన జడేజా!

  • Published Feb 15, 2024 | 5:00 PM Updated Updated Feb 15, 2024 | 5:00 PM

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. గాయం నుంచి కోలుకుని శతక గర్జన చేశాడు జడ్డూ భాయ్.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. గాయం నుంచి కోలుకుని శతక గర్జన చేశాడు జడ్డూ భాయ్.

Ravindra Jadeja: సూపర్‌ సెంచరీ.. గాయం నుంచి కోలుకుని గర్జించిన జడేజా!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగారు. ముందుగా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో దుమ్మురేపగా.. ఆ తర్వాత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా శతక్కొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టు భారీ స్కోర్ ను అందించాడు. తొలుత రోహిత్ తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. ఆ తర్వాత డెబ్యూ బ్యాటర్ సర్ఫరాజ్ తో కూడా విలువైన పార్ట్ నర్ షిప్ ను నమోదు చేశాడు. 198 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ బాదాడు జడ్డూ భాయ్.

రవీంద్ర జడేజా.. గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో అందుబాటులో లేడు. అయితే మూడో టెస్ట్ కు ముందుదాకా అతడు ఆడతాడా? లేడా? అన్న అనుమానం అందరిలో నెలకొంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మూడో టెస్ట్ లోకి బరిలోకి దిగిన జడేజా సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. 198 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ బాదాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఇక టెస్టుల్లో జడ్డూకి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో తొలుత రోహిత్ తో కలిసి నాలుగో వికెట్ కు 204 పరుగుల భారీ పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పాడు. ఆ తర్వాత కొత్త బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి ఐదో వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.