iDreamPost
android-app
ios-app

కొత్త చరిత్ర లిఖించిన జడేజా! భారత తొలి బౌలర్‌గా..

  • Published Jul 28, 2023 | 11:02 AM Updated Updated Jul 28, 2023 | 11:02 AM
  • Published Jul 28, 2023 | 11:02 AMUpdated Jul 28, 2023 | 11:02 AM
కొత్త చరిత్ర లిఖించిన జడేజా! భారత తొలి బౌలర్‌గా..

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 29 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బద్దులుకొడుతూ.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. పైగా ఆ రికార్డు నమోదు చేసింది ఎవరో కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్‌, భారత్‌కు మొట్టమొదటి వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌. 29 ఏళ్ల క్రితం ఆ దిగ్గజ క్రికెటర్‌ నెలకొల్పిన రికార్డును ఇప్పుడు సర్‌ జడేజా బ్రేక్‌ చేసి.. సరికొత్త రికార్డను సృష్టించాడు.

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌ 1-0తో కైవసం చేసుకున్న భారత్‌.. మూడు వన్డేల సిరీస్‌ను సైతం గెలుపుతోనే ఆరంభించింది. గురువారం జరిగిన తొలి వన్డేలో విండీస్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తూ.. భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లే పెవిలియన్‌ పంపుతూ.. వెస్టిండీస్‌తో వన్డేను టీ20 మ్యాచ్‌లా ముగించింది. సిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, జడేజా వికెట్ల పండుగ చేసుకున్నారు. ఒకరు నాలుగు, మరొకరు మూడు వికెట్లతో రెచ్చిపోయారు. దీంతో విండీస్‌ 114 పరుగులకే కుప్పకూలింది. ఈ టార్గెట్‌ను 22.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయిన టీమిండియా ఛేదించి గెలిచింది.

ఈ మ్యాచ్‌లో జడేజా మూడు వికెట్లతో సత్తాచాటాడు. దాంతోనే వెస్టిండీస్‌పై వన్డేల్లో 44 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. విండీస్‌ టీమ్‌పై వన్డేల్లో అత్యధిక 43 వికెట్లు తీసిన కపిల్‌ దేవ్‌ రికార్డును బద్దులుకొడుతూ.. జడేజా 44 వికెట్లతో టీమిండియా తరపున తొలి బౌలర్‌గా నిలిచాడు. కపిల్‌ 43 వికెట్ల రికార్డును 29 ఏళ్లుగా ఎవరూ దాటలేకపోయారు. టీమిండియా దిగ్గజ బౌలర్లుగా పేరున్న అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌, షమీ సైతం వెనకబడిపోయారు. కానీ జడేజా సాధించాడు. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసుకున్న బౌలర్ల జాబితాలో జడేజా 44 వికెట్లతో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా.. కపిల్‌ దేవ్‌(43), అనిల్‌ కుంబ్లే(41), మొహమ్మద్‌ షమీ(37), హర్భజన్‌సింగ్‌ (33) వికెట్లతో వరుసగా ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో జడేజా సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వయసు అయిపోయిందంటారు.. వాళ్లు లేకుంటే టీమ్‌లో పసే లేదు!