iDreamPost
android-app
ios-app

సరికొత్త రికార్డు సృష్టించిన జడేజా!ఎలైట్ లిస్ట్‌లో చోటు..

  • Author Soma Sekhar Published - 07:35 PM, Fri - 15 September 23
  • Author Soma Sekhar Published - 07:35 PM, Fri - 15 September 23
సరికొత్త రికార్డు సృష్టించిన జడేజా!ఎలైట్ లిస్ట్‌లో చోటు..

ఆసియా కప్ లో భాగంగా.. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్ లో 200వ క్యాచ్ పట్టి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా సారథి , హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇక ఇదే మ్యాచ్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నయా రికార్డును నెలకొల్పాడు. తద్వారా ఎలైట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ సరికొత్త రికార్డు సాధించిన టీమిండియా రెండవ ఆటగాడిగా ఘనతకెక్కాడు రవీంద్ర జడేజా! ఈ మ్యాచ్ లో షమీమ్ హుస్సేన్ వికెట్ పడగొట్టడం ద్వారా జడ్డూ ఈ మైలురాయిని చేరాడు.

ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నయా రికార్డును నెలకొల్పాడు. తద్వారా ఈ మైలురాయి అందుకున్న టీమిండియా రెండో ప్లేయర్ గా ఘనత వహించాడు జడేజా. ఈ మ్యాచ్ లో బంగ్లా ఆటగాడు షమీమ్ హుస్సేన్ వికెట్ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు జడేజా. దీంతో వన్డేల్లో 200 వికెట్లతో పాటుగా 2వేల పరుగులు సాధించిన రెండో టీమిండియా ప్లేయర్ గా ఘనత సాధించాడు. ఓవరాల్ గా 14వ ప్లేయర్ గా నిలిచాడు జడేజా. వన్డేల్లో టీమిండియా తరపున దిగ్గజం కపిల్ దేవ్ వన్డేల్లో 253 వికెట్లు, 3783 పరుగులు సాధించి తొలి టీమిండియా ప్లేయర్ గా ఉన్నాడు.

ఇక భారత్ తరపున 200 వికెట్లు సాధించిన ఏడో బౌలర్ గా జడేజా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా.. 182వ వన్డే మ్యాచ్ ఆడుతున్న జడేజా 200 వికెట్లు తీయడంతో పాటుగా 2578 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ షకీబ్(80), తౌహిద్ హ్రిడోయ్(54) నాసమ్ అహ్మద్(44) పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, షమీ 2, ప్రసిద్ద కృష్ణ, అక్షర్, జడేజా తలా ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు తొలి ఓవర్ లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హసన్ షకీబ్ బౌలింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌట్ గా వెనుదిరిగాడు.