iDreamPost
android-app
ios-app

ఇంగ్లండ్ ను వణికించిన అశ్విన్.. వరుసగా..!

  • Published Feb 25, 2024 | 2:23 PM Updated Updated Feb 25, 2024 | 2:23 PM

46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ టీమ్ కు ఊహించని షాకిచ్చాడు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ టీమ్ కు ఊహించని షాకిచ్చాడు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

ఇంగ్లండ్ ను వణికించిన అశ్విన్.. వరుసగా..!

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. రెండు టీమ్స్ కూడా విజయం కోసం హోరాహోరిగా పోరాడుతున్నాయి. తొలిరెండు రోజులు ఇంగ్లండ్ పై చేయి సాధిస్తే.. మూడో రోజు సత్తాచాటుతున్నారు భారత ప్లేయర్లు. తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది టీమిండియా. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఊహించని షాకిచ్చాడు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అదరగొడుతున్నాడు. వరుసగా వికెట్లు తీస్తూ.. సత్తాచాటుతున్నా ఈ స్టార్ స్పిన్నర్. ఈ క్రమంలోనే పలు రికార్డులను సైతం బద్దలుకొడుతూ.. దూసుకెళ్తున్నాడు. తాజాగా రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో సైతం ఇంగ్లండ్ టీమ్ ను ఘోరంగా దెబ్బతీశాడు. తక్కువ వ్యవధిలోనే ప్రత్యర్థి టాపార్డర్ ను పెలియన్ కు పంపాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బజ్ బాల్ స్ట్రాటజీతోనే బ్యాటింగ్ చేసంది. ఓపెనర్ జాక్ క్రాలే ఫోర్లతో ఎదురుదాడికి దిగాడు. అయితే 5వ ఓవర్ వేయడానికి వచ్చిన అశ్విన్ టీమిండియాకు బ్రేక్ త్రూ అందించాడు. బెన్ డకెట్ ను 15 పరుగులకే డగౌట్ కు పంపాడు. ఆ తర్వాత నెక్ట్స్ బాల్ కే స్టార్ ప్లేయర్ ఓలీ పోప్ ను గోల్డెన్ డకౌట్ చేశాడు.

దీంతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు క్రాలే-రూట్. కానీ వారికి ఆ టైమ్ ఇవ్వలేదు అశ్విన్. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్ ను 11 రన్స్ కు ఎల్బీ రూపంలో బలిగొన్నాడు. దీంతో 65 రన్స్ కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్ కు కుల్దీప్ యాదవ్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫిఫ్టీతో దూసుకెళ్తున్న జాక్ క్రాలే ను 60 పరుగుల వద్ద బౌల్డ్ చేశాడు కుల్దీప్. ఆ తర్వాత ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ బెన్ స్టోక్స్ ను కూడా కుదురుకోకుండా.. కేవలం 4 రన్స్ కే డ్రస్సింగ్ రూమ్ కు పంపాడు. దీంతో 120 రన్స్ కు సగం వికెట్లు కోల్పోయింది పర్యాటక టీమ్. ప్రస్తుతం 166 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది ఇంగ్లండ్.

ఇదికూడా చదవండి: టీమిండియాలో నెక్ట్స్ ధోని అతడే.. గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!