టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వరల్డ్ కప్ 2023 జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడిని తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక రవిచంద్రన్ అశ్విన్ లో ఉన్న కామెడీ టైమింగ్ ను అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. తనదైన శైలిలో ట్వీట్స్ పెడుతూ ట్రోలర్స్ కు, నెటిజన్స్ కు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇస్తూ ఉంటాడు. తాజాగా ఓ నెటిజన్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్. అశ్విన్ ఇచ్చిన సమాధానానికి పాకిస్థాన్ కూడా ఫిదా అయ్యింది.
రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనదైక కామెడీ టచ్ ఇస్తూ.. ప్రత్యర్థిపై పంచులు వేస్తూ ఉంటాడు. అశ్విన్ ఇచ్చే కౌంటర్లు చూస్తే ఇతడితో ఇంత కామెడీ టైమింగ్ ఉందా? అని అనుమానం రాకమానదు. తాజాగా ఓ నెటిజన్ సమాధానానికి దిమ్మతిరిదే ఆన్సర్ ఇచ్చాడు అశ్విన్. వరల్డ్ కప్ కామెంటరీ ప్యానల్ లో ఉన్న దినేశ్ కార్తీక్ తో మెగా టోర్నీ ప్లానింగ్స్ గురించి చర్చించాడు అశ్విన్. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అశ్విన్ ను టార్గెట్ చేస్తూ.. ఓ ప్రశ్న అడిగాడు. 2014 ఆసియా కప్ లో పాక్ తో జరిగిన మ్యాచ్ లాస్ట్ ఓవర్ వీడియోను టాగ్ చేస్తూ.. నీ ఓవర్లో అఫ్రిదీ కొట్టిన సిక్స్ లు గుర్తున్నాయా? అంటూ ఎగతాళి చేశాడు.
ఇక ఈ ప్రశ్నకు అశ్విన్ జెంటిల్ మెన్ రిప్లై ఇచ్చాడు. ‘అవి చాలా నిజంగా అద్భుతమైన షాట్లు. నేను మంచి బ్యాటర్ గా అతడి ఆటను ఎంజాయ్ చేస్తా’అంటూ రిప్లై ఇచ్చాడు. అశ్విన్ ఇచ్చిన సమాధానానికి సదరు నెటిజన్ సైతం ఆశ్చర్యపోయాడు. ఇక అశ్విన్ ఇచ్చిన కౌంటర్ కు పాకిస్థాన్ కూడా ఫిదా అయ్యింది. తన హుందాతనం తగ్గకుండా, ప్రత్యర్థి బ్యాటర్ అయిన అఫ్రిదీకి కూడా గౌరవం ఇస్తూ.. అశ్విన్ ఇచ్చిన కౌంటర్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. 2014 ఆసియా కప్ లో ఇండియా-పాక్ తలపడింది. ఈ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ అశ్విన్ వేశాడు. అయితే అప్పటికే టీమిండియా గెలిచే స్థితిలో ఉంది. కానీ అనూహ్యంగా చివరి ఓవర్ లో అఫ్రిదీ రెండు భారీ సిక్సర్లు బాది పాక్ ను గెలిపించాడు. మరి నెటిజన్ కు అశ్విన్ ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ravichandran Ashwin – A true gentleman🙌 pic.twitter.com/lQI94LGfLo
— CricTracker (@Cricketracker) October 1, 2023