SNP
Ravichandran Ashwin, TNPL 2024, DD vs CSG: టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. వన్‌డైన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మరీ విధ్వంసం సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
Ravichandran Ashwin, TNPL 2024, DD vs CSG: టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. వన్‌డైన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మరీ విధ్వంసం సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
SNP
పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైరు.. అనే సినిమా డైలాగ్‌లా రవిచంద్రన్ అశ్విన్ అంటే చాలా మంది స్పిన్నర్ మాత్రమే అనుకుంటారు.. కానీ, అతనో నిఖార్సయిన ఆల్‌రౌండర్. టీమిండియాకు ఆడే సమయంలో బ్యాటింగ్‌లో అశ్విన్‌కు సరైన అవకాశాలు రాలేదు కానీ, వచ్చిన తక్కువ సమయాల్లో కూడా తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు అశ్విన్. తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో అయితే అరివీర భయంకరమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా కూడా ఆడిన అశ్విన్.. బుధవారం చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లో 57 పరుగులు చేసి తన టీమ్ దిండిగల్ డ్రాగన్స్‌ను క్వాలిఫైయర్-2కు తీసుకెళ్లాడు.
159 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో ఓపెనర్ విమల్ ఖుమార్ కేవలం 3 పరుగులకే చేసి అవుట అవ్వడంతో డ్రాగన్స్ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. శివమ్ సింగ్‌తో కలిసి, వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసి.. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ శివమ్ సింగ్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 112 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి.. ఆల్‌మోస్ట్ విజయాన్ని ఖాయం చేశాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ రెండో బంతికి ప్రేమ్ కుమార్ బౌలింగ్‌లో జగదీషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. క్వాలిఫైయర్-2లో దిండిగల్ డ్రాగన్స్ తిరుప్పూర్ తమిజన్స్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ అపరాజిత్ 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 72 పరుగులు చేసింది. ఇతర బ్యాటర్లలో జగదీషన్ 25, అభిషేక్ తన్వర్ 22 పరుగులు చేశాడు. ఇక 159 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన దిండిగల్ డ్రాగన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ శివమ్ సింగ్ 64, కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ 57 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ash-tonishing attack up front from Ashwin to take Dindigul Dragons a step closer to 🏆#TNPLonFanCode @ashwinravi99 pic.twitter.com/tbhqYLujMC
— FanCode (@FanCode) August 1, 2024