Nidhan
Ravichandran Ashwin Sets New World Record: భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను అతడు అందుకున్నాడు.
Ravichandran Ashwin Sets New World Record: భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను అతడు అందుకున్నాడు.
Nidhan
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ను చిరస్మరణీయంగా మార్చుకుంటున్నాడు ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. తనలో నిద్రపోతున్న బ్యాటర్‌ను మరోమారు లేపిన అతడు.. కీలక సమయంలో రెచ్చిపోయి ఆడాడు. సెంచరీతో విజృంభించి అందరూ తన గురించి మాట్లాలేలా చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి స్టార్ బ్యాటర్లు ఫెయిలైన చోట క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించాడు అశ్విన్. కష్టాల్లో ఉన్న జట్టును స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలసి ఒడ్డున పడేశాడు. ఈ క్రమంలో అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను అతడు అందుకున్నాడు. అశ్విన్ సాధించిన ఆ రేర్ ఫీట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చెన్నై వేదికగా బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో స్టన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు అశ్విన్. 112 బంతుల్లో 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్టార్లంతా విఫలమైన చోట.. అతడు పరుగుల విధ్వంసం సృష్టించాడు. 144 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్న టైమ్‌లోకి క్రీజులోకి వచ్చిన అశ్విన్.. జడేజా (117 బంతుల్లో 86 నాటౌట్)తో కలసి టీమ్‌ను ఆదుకున్నాడు. ఇద్దరూ కలసి ఏడో వికెట్‌కు అజేయంగా 195 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజు ముగిసేసరికి 6 వికెట్లకు 339 పరుగులతో పటిష్టమైన స్థితికి చేరుకుంది మెన్ ఇన్ బ్లూ. ఈ క్రమంలో అశ్విన్ రేర్ ఫీట్ నమోదు చేశాడు. అతడి టెస్ట్ కెరీర్లో ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేయడం ఇది 20వ సారి కావడం విశేషం. తద్వారా ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 20కి పైగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు, 30కి పైగా 5 వికెట్స్ హాల్స్ సాధించిన మొదటి క్రికెటర్‌గా అశ్విన్ కొత్త చరిత్ర లిఖించాడు.
టెస్టుల్లో అశ్విన్ ఇప్పటిదాకా 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. కాగా, అత్యధిక ఫిఫ్టీలు, 30కి పైగా ఫైవ్ వికెట్ హాల్స్ సాధించిన ప్లేయర్ల జాబితాలో అశ్విన్ తర్వాతి ప్లేస్‌లో న్యూజిలాండ్ లెజెండ్ రిచర్డ్ హ్యాడ్లీ ఉన్నాడు. అతడు 17కు పైగా హాఫ్ సెంచరీలు, 30 కంటే ఎక్కువ 5 వికెట్స్ హాల్స్ తీశాడు. చెన్నై టెస్ట్‌తో భారత స్పిన్నర్ మరో రేర్ ఫీట్‌ను నెలకొల్పాడు. ఒకే వేదికలో రెండు టెస్టు సెంచరీలతో పాటు మోస్ట్ ఫైవ్ వికెట్స్ హాల్స్ సాధించిన క్రికెటర్‌గా అశ్విన్ రికార్డు క్రియేట్ చేశాడు. చెపాక్ స్టేడియంలో 2 సెంచరీలతో పాటు 4 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడతను. ఇప్పటిదాకా ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ బోథమ్ పేరు మీద ఉండేది. లీడ్స్‌లో రెండు సెంచరీలతో పాటు మూడు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడతను. తాజా మ్యాచ్‌తో బోథమ్ ఆల్‌టైమ్ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టేశాడు. మొత్తంగా ఒక్క సెంచరీతో రెండు క్రేజీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్ క్రికెటర్. మరి.. అశ్విన్ అరుదైన ఘనతను అందుకోవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.