ఒక వికెట్ రెండు రికార్డులు! అశ్విన్ అరుదైన ఘనత..

  • Author Soma Sekhar Updated - 05:48 PM, Sat - 23 December 23

ఈ క్రమంలోనే టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఆరంభం నుంచే విండీస్ బ్యాటర్లపై ఆధిపత్యాన్ని చెలాయించారు టీమిండియా బౌలర్లు. ఇక ఈ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును సృష్టించి.. దిగ్గజాల సరసన చేరాడు టీమిండియా వెంటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

ఈ క్రమంలోనే టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఆరంభం నుంచే విండీస్ బ్యాటర్లపై ఆధిపత్యాన్ని చెలాయించారు టీమిండియా బౌలర్లు. ఇక ఈ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును సృష్టించి.. దిగ్గజాల సరసన చేరాడు టీమిండియా వెంటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

  • Author Soma Sekhar Updated - 05:48 PM, Sat - 23 December 23

2023 వరల్డ్ కప్ ముంగిట టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరింది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడేందుకు భారత జట్టు విండీస్ లో అడుగుపెట్టింది. జూలై 12న(బుధవారం) ప్రారంభం అయిన తొలి టెస్ట్ లో టీమిండియా బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. పసికూనకు తమ బౌలింగ్ సత్తా ఏంటో చూపించడం తొలి సెషన్ లోనే ప్రారంభించారు. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఆరంభం నుంచే విండీస్ బ్యాటర్లపై ఆధిపత్యాన్ని చెలాయించారు టీమిండియా బౌలర్లు. ఇక ఈ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును సృష్టించి.. దిగ్గజాల సరసన చేరాడు టీమిండియా వెంటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా వెంటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ ను తొలి దెబ్బ తీశాడు అశ్విన్. ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో టగైనరైన్ చందర్ పాల్(12)ను తన స్పిన్ మాయాజాలంతో బోల్తా కొట్టించాడు. సూపర్ బాల్ తో అతడిని బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్ వైట్(20) ను కూడా అవుట్ చేశాడు. ఇక చందర్ పాల్ ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ రెండు అరుదైన రికార్డులను క్రియేట్ చేశాడు.

అందులో మెుదటి రికార్డ్ విషయానికి వస్తే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తండ్రీకొడుకుల వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా అశ్విన్ నయా రికార్డ్ నెలకొల్పాడు. 2011లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు శివనారాయణ్ చందర్ పాల్ వికెట్ ను తీశాడు అశ్విన్. మళ్లీ ఇప్పుడు అతడి కొడుకు టగెనరైన్ చందర్ పాల్ వికెట్ ను పడగొట్టాడు. దాంతో తండ్రీకొడుకుల వికెట్ తీసిన తొలి ఇండియాన్ బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఇక రెండో రికార్డు విషయానికి వస్తే.. టెస్టుల్లో అత్యధికంగా 95 సార్లు బౌల్డ్ ఔట్స్ చేసిన భారత తొలి బౌలర్ గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం అనీల్ కుంబ్లే(94 బౌల్డ్ అవుట్స్) రికార్డును బద్దలు కొట్టాడు అశ్విన్. ఆ తర్వాత స్థానంలో కపిల్ దేవ్ (88), షమీ (66) ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా బౌలర్ల ధాటికి విండీస్ టాపార్డర్ కుప్పకూలింది. ప్రస్తుతం 28 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 68 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది విండీస్. జట్టులో బ్రాత్ వైట్(20), చందర్ పాల్ (12), రేమన్ రైఫర్ (2), బ్లాక్ వుడ్ (14) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. బ్లాక్ వుడ్ ను సిరాజ్ అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు చేర్చాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, జడేజా తలా ఓ వికెట్ తీశారు.


ఇదికూడా చదవండి: వీడియో: డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ధోనీ!

Show comments