iDreamPost
android-app
ios-app

వీడియో: డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ధోనీ!

వీడియో: డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ధోనీ!

ప్రతి ఒక్కరికి తాము అభిమానించే వ్యక్తి లేదా వ్యక్తులు ఉంటారు. అలాంటి వారిని కలవాలని.. వారితో మాట్లాడాలని ఎంతో కోరిక ఉంటుంది. అయితే అది సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు సైతం ఉంటుంది. వాళ్లు అభిమానించే వ్యక్తులను కలిసిన సమయంలో వాళ్లు కూడా ఆనందంతో అలాగే చిన్న పిల్లల్లా మారిపోతారు. సంతోషంతో గెంతులేస్తారు. అలాంటి ఒక చిన్న పిల్లాడినే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ చూస్తున్నారు. తాజాగా విఘ్నేష్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నయనతారను ప్రేమించి.. పెళ్లాడిని తర్వాత విఘ్నేష్ పేరు పాన్ ఇండియా లెవల్లో మోగిపోయింది. వాళ్ల పెళ్లికి షారుక్ ఖాన్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొన్ని నెలలుగా విఘ్నేష్- నయన్ పేరు ఏదొక కారణం వల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మరోసారి విఘ్నేష్ పేరు వార్తల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అయితే ఈసారి నెగెటివ్ గా కాదులెండి.

విఘ్నేష్ శివన్ తన అభిమాన క్రికెటర్ ధోనీని కలిశాడు.  ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే విఘ్నేష్ కు ధోనీ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. విఘ్నేష్ వేసుకున్న టీ షర్ట్ మీద ధోనీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ సమయంలో స్టార్ డైరెక్టర్ కాస్తా.. చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఆనందంతో ఊగిపోయాడు. ధోనీ చేతులు పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. ధోనీ చేతికి ముద్దుపెట్టి ఇంతకన్నా నాకు ఏం కావాలి అన్నట్లు చూశాడు. అందుకు సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

“నా హీరో, నా రోల్ మోడల్, నా కెప్టెన్ ని కలిశాను. ఆయన్ను కలిసిన ప్రతిసారి తెలియని భావోద్వైగానికి లోనవుతూ ఉంటాను. నేను ఆయన్ను చూసిన ప్రతిసారి నా ముఖంలో వచ్చే ఆనందాన్ని చూసి మరింత ఆనందం పడుతూ ఉంటాను. తమిళ్ ఇండస్ట్రీని ఎంచుకోవడం.. మొదటి చిత్రాన్ని ఇక్కడి నుంచే చేయండం ఎంతో ఆనందంగా ఉంది. ధోనీ నుంచి వచ్చే చిత్రాలను థియేటర్లలో చూసి మా ప్రేమ, మద్దతు తెలియజేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అంటూ విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom giriş