iDreamPost
android-app
ios-app

IND vs BAN: సొంత గ్రౌండ్‌లో రెచ్చిపోయిన అశ్విన్‌! రోహిత్‌, కోహ్లీ ఫెయిలైన చోట మాస్‌ ఇన్నింగ్స్‌

  • Published Sep 19, 2024 | 5:00 PM Updated Updated Sep 19, 2024 | 5:00 PM

Ravichandran Ashwin, IND vs BAN: భారత్‌-బంగ్లా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..

Ravichandran Ashwin, IND vs BAN: భారత్‌-బంగ్లా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..

  • Published Sep 19, 2024 | 5:00 PMUpdated Sep 19, 2024 | 5:00 PM
IND vs BAN: సొంత గ్రౌండ్‌లో రెచ్చిపోయిన అశ్విన్‌! రోహిత్‌, కోహ్లీ ఫెయిలైన చోట మాస్‌ ఇన్నింగ్స్‌

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. గురువారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్‌లో.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు బంగ్లా బౌలర్‌ హసన్‌ మహమూద్‌ ఊహించని షాకిచ్చాడు. రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీని వెంటవెంటనే అవుట్‌ చేశాడు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడిన టీమిండియాను యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌ జోడీ కాస్త ఆదుకుంది. లంచ్‌ టైమ్‌కు మరో వికెట్‌ పడకుండా 88 పరుగులు చేశారు. లంచ్‌ తర్వాత మళ్లీ వికెట్ల పడ్డాయి. జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొని అవుట్‌ అయ్యాడు. మొత్తంగా టీమిండియా 144 పరుగుల వద్ద 6వ వికెట్‌ కోల్పోయింది.

ఆ తర్వాత.. జడేజాతో జత కలిసి రవిచంద్రన్‌ అశ్విన్‌.. తన సొంత గ్రౌండ్‌లో రెచ్చిపోయాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి దిగ్గజ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై ఎలా బ్యాటింగ్‌ చేయాలో చూపిస్తూ.. ఊర మాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇది టెస్ట్‌ మ్యాచ్‌ అనే విషయం మర్చిపోయాడు, వికెట్లు పడిపోయానే భయం​ లేకుండా.. ప్రాపర్‌ వన్డే ఇన్నింగ్స్‌తో బాల్‌ టూ బాల్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. మొత్తంగా 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఫోర్లు, 2 సిక్సులతో సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. అశ్విన్‌కు రవీంద్ర జడేజా కూడా సూపర్‌ బ్యాటింగ్‌తో మంచి సపోర్ట్‌ అందించారు.

అశ్విన్‌ సూపర్‌ డూపర్‌ ఇన్నింగ్స్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఫిదా అయిపోయారు. అశ్విన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న సమయంలో.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో నిల్చోని మరి చప్పట్లు కొడుతూ అశ్విన్‌ను అభినందించారు. స్టార్‌ బ్యాటర్లు బ్యాటర్లు పరుగులు చేయలేకపోయినా పిచ్‌పై, బంగ్లా బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకుంటూ.. అశ్విన్‌ చేసిన సూపర్‌ బ్యాటింగ్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా నిలిచింది. అంద్భుతమైన బ్యాటింగ్‌తో ఒకానొక టైమ్‌లో టీమిండియా 200 పరుగులైనా చేస్తుందో లేదో అని కంగారు పడిన అభిమానులకు ధైర్యం ఇస్తూ.. టీమిండియా స్కోర్‌ను 300 దాటించాడు. మరి అశ్విన్‌ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.