Nidhan
Ravichandran Ashwin, Virat Kohli, IND vs BAN: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తడాఖా ఏంటో చూపించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. ఒకే మ్యాచ్‌తో చాలా రికార్డులు తన మీద రాసుకున్నాడు.
Ravichandran Ashwin, Virat Kohli, IND vs BAN: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తడాఖా ఏంటో చూపించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. ఒకే మ్యాచ్‌తో చాలా రికార్డులు తన మీద రాసుకున్నాడు.
Nidhan
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తడాఖా ఏంటో చూపించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. ఒకే మ్యాచ్‌తో చాలా రికార్డులు తన మీద రాసుకున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా కూడా అద్భుతంగా రాణించడంతో భారత్ ఘనవిజయం సాధించింది. ఫస్ట్ టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. పంత్, గిల్ సెంచరీలు బాదినా, జడేజా ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో దుమ్మురేపినా, బుమ్రా వికెట్లతో వీరవిహారం చేసినా ఈ సక్సెస్‌లో అశ్విన్‌కే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో అతడు చూపిన తెగువ, పోరాటాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈ మ్యాచ్‌లో అనేక పాత రికార్డులకు పాతర పెట్టిన లెజెండరీ స్పిన్నర్.. మరో అరుదైన ఘనత అందుకున్నాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన స్థానం సంపాదించాడు.
చెన్నై టెస్ట్‌లో బ్యాటింగ్‌లో సెంచరీతో చెలరేగిన అశ్విన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును ఎంచుకున్నాడు. లాంగ్ ఫార్మాట్లో అతడికి ఇది 10వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం కావడం విశేషం. భారత్ తరఫున అత్యధిక సార్లు ఈ అవార్డును గెలుచుకున్న మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (10), రవీంద్ర జడేజా (10)తో కలసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాడు అశ్విన్. ఇంకో అవార్డు సాధిస్తే వాళ్లిద్దర్నీ దాటేసి కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తాడు. ఈ మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్లో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలోకి ఎగబాకాడు అశ్విన్. అతడు 37 సార్లు ఫైఫర్స్ తీయగా.. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (67) ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్లో 6 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు అశ్విన్. సెంచరీ బాదిన ఓల్డెస్ట్ ఇండియన్ క్రికెటర్స్ లిస్ట్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. 5 వికెట్స్ హాల్ తీసిన ఓల్డెస్ట్ ఇండియన్ బౌలర్‌గానూ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకే టెస్ట్‌లో సెంచరీ బాదడమే గాక 5 వికెట్లు కూడా తీసిన ఓల్డెస్ట్ ప్లేయర్‌గా ఇంకో రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా చాలా రికార్డులు తన పేరు మీద రాసుకున్నాడు. ఇక, చెన్నై టెస్ట్ నాలుగో రోజు 515 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ తొలి గంట సేపు బాగానే ఆడింది. ఆ టీమ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో (82), షకీబ్ అల్ హసన్ (25) భారత బౌలర్లను ప్రతిఘటించారు. ముఖ్యంగా షంటో భారీ షాట్లు బాదుతూ భయపెట్టాడు. కానీ జడేజా-అశ్విన్ ద్వయం వాళ్లిద్దరి పని పట్టింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్ దిశగా సాగారు. 234 పరుగులకే ఆ టీమ్ కుప్పకూలింది. అశ్విన్ 6 వికెట్లు తీయగా.. జడ్డూ 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు ఒక వికెట్ దక్కింది.
Most Player of the match awards for India among active players in Tests:
Ravindra Jadeja – 10
Ravichandran Ashwin – 10*
Virat Kohli – 10 pic.twitter.com/egDT7Y6rOY— Johns. (@CricCrazyJohns) September 22, 2024